గువహతి : బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో తొలి రోజు భారత్‌కు శుభారంభం దక్కింది. పతకం ఆశలు రేపుతున్న తన్వి శర్మ, ఉన్నతి హుడాతో పాటు మొత్తం ఏడుగురు షట్లర్లు రెండో రౌండ్‌కు ముందంజ వేశారు.
టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన తన్వి.. 15-2, 15-1తో విక్టోరియాను 11 నిమిషాల్లోనే మట్టి కరిపించింది. ఉన్నతి.. 15-8, 15-9తో లియు హొయ్ను 23 నిమిషాల్లో చిత్తుచేసింది.