Team India : వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిందో లేదో టీమిండియా(Team India) మరో సిరీస్‌కు సిద్ధమైంది. మరో మూడు రోజుల్లో ఐర్లాండ్(Ireland)తో టీ20 సిరీస్ ఆడనుంది. దాంతో, స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) నేతృత్వంలోని యువ భారత బృందం ఈరోజు ఐర్లాండ్ బయలు దేరింది. టీమిండియా క్రికెటర్లు విమానంలో ఉన్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్టర్లో పెట్టింది.
ఇండియన్ క్రికెట్ టీమ్(Indian Cricket Team) తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో బుమ్రాతో పాటు రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), పేసర్ ప్రసిధ్ కృష్ణ, రింకూ సింగ్ Rinku Singh), వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. నిరుడు సెప్టెంబర్‌తో ఆటకు దూరమైన బుమ్రా ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా ఐపీఎల్ 16వ సీజన్ నుంచి తప్పుకున్న ప్రసిధ్ కూడా ఈ పర్యటనతో మళ్లీ జట్టులోకి వచ్చాడు. దాంతో, భారత బౌలింగ్ యూనిట్లో కీలకమైన వీళ్లిద్దరూ ఎలా రాణిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.
Ireland 🇮🇪, here we come ✈️ #TeamIndia | #IREvIND pic.twitter.com/A4P66WZJzP
— BCCI (@BCCI) August 15, 2023
భారత బృదం : జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ప్రసిధ్ కృష్ణ, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వీ జైస్వాల్, తిలక్ వర్మ, జితేశ్ శర్మ, శివం దూబే, షహబాజ్ అహ్మద్, సంజూ శాంసన్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్.
భారత్, ఐర్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్ ఆగస్టు 18న మొదల్వనుంది. రెండో మ్యాచ్ 20న, మూడో టీ20 23వ తేదీన జరుగనున్నాయి. ఆసియా కప్(Asia Cup), వన్డే వరల్డ్ కప్(odi wc 2023) వంటి మెగా టోర్నీలకు ముందు జరుగుతున్న ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు ఎంతో కీలకం.
పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా
ఇందులో రాణించినవాళ్లకు ఆసియా కప్ ప్రిపరేషన్ క్యాంపులో చోటు దక్కే అవకాశం ఉంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో క్యాంపు ముగిశాక జట్టును ప్రకటిస్తారు. ఆసియా కప్‌లోనూ అదరగొట్టిన ఆటగాళ్లకు ప్రపంచ కప్ స్క్వాడ్‌కు ఎంపికయ్యే చాన్స్ ఉంది.