న్యూఢిల్లీ: ఐసీసీ తాజా ర్యాంకులను రిలీజ్ చేసింది. ఫాస్ట్ బౌలర్ బుమ్రా(Jasprit Bumrah) .. ఐసీసీ మెన్స్ టెస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ కొట్టేశాడు. నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో.. బుమ్రా కీలకమైన 8 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆ మ్యాచ్‌లో ఇండియా 295 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయితే బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో.. కగిసో రబడ, జోష్ హేజిల్‌వుడ్‌ను దాటేశాడు బుమ్రా.
Back to the top and a career-best rating 🙌
One of India’s best headlines the latest ICC Rankings moves 👇https://t.co/aJzYloew2R
— ICC (@ICC) November 27, 2024
ఈ ఏడాది ఫిబ్రవరిలో.. ఇంగ్లండ్‌పై 9 వికెట్లు తీసి మెన్స్ బౌలింగ్‌లో టాప్ ర్యాంక్ సాధించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా మేటి ప్రదర్శన ఇచ్చాడు. అయితే రబడ అతన్ని ఓవర్టేక్ చేసినా.. మళ్లీ పెర్త్ మ్యాచ్‌తో బుమ్రా అగ్రస్థానానికి చేరుకున్నాడు. టెస్టు బౌలర్ల జాబితాలో మొహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం 25వ స్థానంలో ఉన్నాడు.
టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సెంచరీ హీరో జైస్వాల్ రెండో స్థానంలో నిలుచున్నాడు. పెర్త్ మ్యాచ్‌లో 161 రన్స్ స్కోర్ చేసిన అతను కీలకమైన పాయింట్లు సాధించి ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. జైస్వాల్ 825 పాయింట్లతో కెరీర్ బెస్ట్‌గా నిలిచాడు. రూట్ కన్నా 78 పాయింట్లు వెనుకబడి ఉన్నాడతను.
పెర్త్ మ్యాచ్‌లో 89 రన్స్ స్కోర్ చేసిన ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో 10వ స్థానంలో నిలిచాడు. ఇక భారత సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో 30వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అతను ఆ సెంచరీతో ర్యాంకింగ్స్‌లో 13వ స్థానానికి చేరుకున్నాడు. టెస్టు ఆల్రౌండర్లలో.. జడేజా, అశ్విన్.. టాప్ రెండు స్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌తో తొలి టెస్టు ఆడకున్నా.. ఆ ఇద్దరూ తమ ర్యాంకులను కోల్పోలేదు.