BCCI | బుమ్రా వచ్చేశాడు.. మళ్లీ భారత టీ20 స్క్వాడ్‌లో ఆ ముగ్గురు..!
BCCI : భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవల గాయాలతో భారత జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీ20 స్క్వాడ్‌లోకి వచ్చేశాడు. అఫ్గనిస్థాన్(Afghanistan)తో మూడు టీ20ల సిరీస్ స్క్వాడ్‌లో బుమ్రా ఎంపికయ్యాడు.
BCCI : భారత క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవల గాయాలతో భారత జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీ20 స్క్వాడ్‌లోకి వచ్చేశాడు. అఫ్గనిస్థాన్ (Afghanistan)తో మూడు టీ20ల సిరీస్‌కు ప్రకటించిన స్క్వాడ్‌లో బుమ్రా ఎంపికయ్యాడు. అలానే.. శ్రీలంక పర్యటనకు దూరమైన ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్‌లు ఫిట్నెస్ సాధించారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మెరుగుపడిన ఈ ముగ్గురినీ స్క్వాడ్‌లోకి తీసుకున్నారు సెలెక్టర్లు.
స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో టీ20 సిరీస్ కోసం భారత సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్‌లను సైతం ఎంపిక చేశారు. మంగళవారం సెలెక్టర్లు శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) సారథిగా, తిలక్ వర్మ డిప్యూటీగా 15మందితో కూడిన బృందాన్ని ప్రకటించారు. జింబాబ్వే పర్యటనలో ఓపెనర్‌గా మెరిసిన వైభవ్ సూర్యవంశీ స్థానం నిలబెట్టుకోగా.. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను తీసుకున్నారు. ఎందుకనో తెలీదుగానీ.. మాజీ కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌లను పక్కన పెట్టేశారు సెలెక్టర్లు.
India’s squad for Afghanistan T20I series announced. #TeamIndia will play three T20Is against Afghanistan at New Delhi, beginning September 13.#AFGvIND pic.twitter.com/UqTUeZyHz8
— BCCI (@BCCI) September 1, 2026
ఫిట్‌గా ఉంటేనే..
కాబూలీలతో సిరీస్ కోసం సెలెక్టర్లు ప్రధాన బౌలర్లను చోటివ్వగా.. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్క్వాడ్‌లోకి వచ్చాడు. రవి బిష్ణోయ్ రెండో స్పిన్నర్‌గా స్థానం సాధించాడు. బుమ్రా, హర్షిత్, వరుణ్ రాకతో ఇంగ్లండ్ గడ్డపై ఆడిన ప్రసిధ్ కృష్ణ, సూర్యాన్ష్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్‌కు అఫ్గన్ సిరీస్‌లో చోటు దక్కలేదు.

అయితే.. స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న బుమ్రా, నితీశ్, సుందర్, రాణాలు ఈ సిరీస్‌లో ఆడతారా? లేదా?అనేది ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని సెలెక్టర్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 13వ తేదీ నుంచి భారత్, అఫ్గనిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్ మొదలవ్వనుంది. సెప్టెంబర్ 15న రెండో మ్యాచ్,17వ తేదీన మూడో టీ20 జరుగనున్నాయి.
భారత టీ20 స్క్వాడ్ : శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), తిలక్ వర్మ(వైస్ కెప్టెన్), శివం దూబే, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుంద్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

