MI vs RCB | నిప్పులు చెరిగిన బుమ్రా.. ఇషాన్, సూర్య విధ్వంసం.. బెంగళూరుకు ఐదో ఓటమి
MI vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో మరో హైహోల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. సొంత ప్రేక్షకుల సమక్షంలో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఏమాత్రం కనికరం లేకుండా చెలరేగింది. గురువారం రాయల్ చాలెంజర్స్ (RCB)తో చెడుగుడు ఆడుకుంది.
MI vs RCB : ఐపీఎల్ 17వ సీజన్లో మరో హైహోల్టేజ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. సొంత ప్రేక్షకుల సమక్షంలో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఏమాత్రం కనికరం లేకుండా చెలరేగింది. వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో బోణీ కొట్టిన హార్దిక్ పాండ్యా సేన గురువారం రాయల్ చాలెంజర్స్ (RCB)తో చెడుగుడు ఆడుకుంది.
మొదట జస్ప్రీత్ బుమ్రా(21జ/5) నిప్పులు చెరగగా.. ఆ తర్వాత ఓపెనర్ ఇషాన్ కిషన్(69) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇక ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(52) ఆడింది 19 బంతులే అయినా.. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో బౌండ్రీల వర్షం కురిపించి ఆర్సీబీని ముంచాడు. భారీ ఛేదనలో వీళ్లిద్దరూ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోయడంతో ముంబై 7వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో, హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూడాలనుకున్న డూప్లెసిస్ బృందానికి నిరాశే మిగిలింది.
ICYMI – Surya lighting up the night SKY with a flurry of SIXES 🔥🔥🔥
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB | @surya_14kumar pic.twitter.com/7CiLtcwTyI
— IndianPremierLeague (@IPL) April 11, 2024
ఆర్సీబీ నిర్దేశించిన 197 పరుగుల ఛేదనలో ముంబైకి అదిరే ఆరంభం లభించింది. ఓపెనర్ ఇషాన్ ఆది నుంచి బౌండరీల మోత మోగించాడు. సిరాజ్, టాప్లే, ఆకాశ్ దీప్.. ఏ ఒక్కరినీ వదలకుండా ఉతికేశాడు. 23 బంతుల్లోనే ఇషాన్ 6 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి విధ్వంసంతో, ఆర్సీబీ ఫీల్డర్లు ప్రేక్షకుల పాత్ర వహించగా.. పవర్ ప్లేలో ముంబై స్కోర్ రాకెట్లా దూసుకెళ్లింది. 6 ఓవర్లకు ముంబై స్కోర్ వికెట్ కోల్పోకుండా 72 రన్స్ చేసింది. ఇషాన్ వీరబాదుడుకు 8.3 ఓవర్లకే ముంబై స్కోర్ వంద దాటింది.
Ishan Kishan & Rohit Sharma are on the charge 💥#MI off to a strong start, 72/0 in the Powerplay 🙌
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/0d1ZtS49Ht
— IndianPremierLeague (@IPL) April 11, 2024
16 బంతుల్లోనే ఫిఫ్టీ
ఎట్టకేలకు ఆకాశ్ దీప్ తన రెండో ఓవర్లో ఇషాన్‌కు బోల్తా కొట్టించి ఈ జోడీని విడదీశాడు. ఇషాన్ ఔటైన కాసేపటికే రోహిత్ శర్మ(38) వెనుదిరిగాడు. టాప్లే ఒంతిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టడతో 139 పరుగుల వద్ద ముంబై రెండో వికెట్ పడింది. ఇంప్యాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(29), పాండ్యాలు పరుగుల ఉధృతిని కొనసాగించారు. సూర్య అయితే దొరికిన బంతిని దొరికినట్టు బౌండ్రీకి పంపించి 16 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(21), తిలక్ వర్మ(16)లు లాంఛనం ముగించారు. ఈ విజయంతో ముంబై నాలుగు పాయింట్లు సంపాదించింది.
ఆ ముగ్గురు దంచగా..
తొలుత ముంబై ఇండియన్స్ సొంత మైదానంలో రాయల్ చాలెంజర్స్ బ్యాటర్లు శివాలూగిపోయారు. విరాట్ కోహ్లీ(3) విఫలమైనా.. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్(61), దినేశ్ కార్తిక్(53 నాటౌట్), రజత్ పాటిదార్(50)లు అర్ధ శతకాలతో కదం తొక్కారు. దాంతో, ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 196 రన్స్ కొట్టింది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగానా.. మిగతా బౌలర్లకు ఈ ముగ్గురు చుక్కులు చూపించారు.

ఒక దశలో 23కే రెండు వికెట్లు పడిన జట్టును డూప్లెసిస్, పాటిదార్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. చివర్లో కార్తిక్ ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. ఆకాశ్ మద్ధాల్ను ఉతికారేస్తూ బౌండరీల వర్షం కురిపించాడు. దాంతో, ఆర్సీబీ నిర్ణీతవ ఓవర్లలో స్కోర్ చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా(21/5) ఐదు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

