GT vs RCB : పదిహేడో సీజన్లో ప్లే ఆఫ్ రేసులో వెనకబడిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కీలక పోరులో భారీ స్కోర్ చేసింది. సొంత గడ్డపై యువకెరటం సాయి సుదర్శన్(84 నాటౌట్), చిచ్చరపిడుగు షారుఖ్ ఖాన్(58)లు హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. 45 పరుగులకే రెండు వికెట్లు పడినా.. వీళ్లిద్దరూ బౌండరీలతో చెలరేగారు. చివర్లో డేవిడ్ మిల్లర్(26 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 రన్స్ కొట్టింది.
టాస్ ఓడిన గుజరాత్‌కు ఆదిలోనే షాక్. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న వృద్ధిమాన్ సాహా(5), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(16)లు స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు. దాంతో, ఒక దశలో 45కే రెండు వికెట్లు పడిన గుజరాత్ టైటాన్స్‌ను సుదర్శన్, షారుక్ ఖాన్(58)లు ఆదుకున్నారు.
Sai Sudharsan attacks Mohd. Siraj for a strong finish 💪
Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #GTvRCB | @gujarat_titans pic.twitter.com/swsS5UF608
— IndianPremierLeague (@IPL) April 28, 2024
బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చిన షారుక్ ఆర్సీబీ బౌలర్లను ఉతికారేశాడు. సుదర్శన్ సైతం ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. షారుఖ్ ఔటయ్యాక గుజరాత్ స్కోర్ బోర్డు వేగం తగ్గినా.. చివర్లో కిల్లర్ మిల్లర్ తన తరహాలో రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 26 రన్స్ బాదేశాడు. దాంతో, ఆర్సీబీకి గిల్ సేన రెండొందల టార్గెట్ నిర్దేశించగలిగింది.