దుబాయ్: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో బుమ్రా.. తన రేటింగ్ పాయింట్లను మెరుగుపరుచుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో 9 వికెట్లతో సత్తా చాటడంతో అతడి ఖాతాలో 14 రేటింగ్ పాయింట్లు (మొత్తంగా 904) చేరాయి.
గతంలో భారత్ నుంచి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఈ ఘనతను అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. మెల్బోర్న్ టెస్టులో బుమ్రా ఇదే జోరును కొనసాగిస్తే అతడి రేటింగ్ పాయింట్లు మరింత మెరుగవుతాయి. బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో బుమ్రా తర్వాత రబాడా, హేజిల్‌వుడ్, కమిన్స్ కొనసాగుతున్నారు.