హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఎస్బీఐ లైఫ్ తెలంగాణలో తన వ్యాపారాన్ని మరింత విస్తరించింది. ఒకేసారి మూడు శాఖలను ప్రారంభించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్కర్నూల్లో కొత్త శాఖలను ప్రారంభించినట్టు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజినల్ డైరెక్టర్ అభిషేక్ కార్ మజుందార్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తులు, కుటుంబాలకు బీమా సౌకర్యాన్ని పెంపొందించడానికి, ఆర్థిక పరిష్కారాలను అందించాలనే ఉద్దేశంతో సరికొత్తగా ఈ శాఖలను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ నూతన శాఖల్లో పాలసీల జారీ, ప్రీమియం వసూళ్లు, పాలసీ సర్వీసింగ్, క్లెయిం అసిస్టెన్స్ వంటి సేవలు అందించనున్నారు.