IND vs PAK : ఆసియా కప్ సూపర్ 4 దశ తొలి పోరులో భారత్, పాకిస్థాన్ ఢీ కొంటున్నాయి. దుబాయ్ వేదికగా లీగ్ దశలో తలపడిన చిరకాల ప్రత్యర్థులు ఇప్పుడు ఫైనల్ బెర్తు వేటలో మరోసారి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా సారథి బౌలింగ్ తీసుకున్నాడు. అంతేకాదు లీగ్ దశ మ్యాచ్ టాస్ సమయంలో మాదిరిగానే ఈసారి కూడా పాక్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య.
ఒమన్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న పేసర్ బుమ్రా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వచ్చారని సూర్య తెలిపాడు. మరోవైపు పాక్ సైతం రెండు మార్పులు చేసింది. హసన్ నవాజ్, ఖష్దిల్ షాను పక్కన పెట్టేశామని సల్మాన్ అఘా చెప్పాడు. వారం క్రితం లీగ్ దశలో భారత్, పాక్ ఎదురుపడగా మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. కుల్దీప్ యాదవ్ విజృంభణకు పాక్ బ్యాటర్లు తోకముడువగా.. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ దంచేశారు. దాంతో.. ఏడు వికెట్ల తేడాతో దాయాదిని చిత్తుగా ఓడించింది సూర్య సేన.
India will bowl first in Dubai!#INDvPAK LIVE 👉 https://t.co/ZifqaxhkMr pic.twitter.com/xh1QWJDEYk
— ESPNcricinfo (@ESPNcricinfo) September 21, 2025
అయితే.. టాస్ సమయంలో హ్యాండ్ షేక్ ఇవ్వకపోవడం.. మ్యాచ్ పూర్తైన తర్వాత కూడా పాక్ ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్లు కరచాలనం చేయకపోవడం వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ చొరవ తీసుకోకపోవడం వల్లనే సూర్య కుమార్ సేన తమతో షేక్‌హ్యాండ్ ఇవ్వలేదని ఐసీసీకి ఫిర్యాదు చేసింది పీసీబీ. కానీ.. ఐసీసీ మాత్రం రిఫరీని మార్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాక్ తుది జట్టు : సయీం ఆయూబ్, షహిబ్జద ఫర్హాం, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలాట్, మొహమ్మద్ హ్యారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రవుఫ్, అబ్రార్ అహ్మద్.