IND vs AFG : పొట్టి వరల్డ్ కప్‌లో లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్(India) సూపర్ 8ను ఘనంగా ఆరంభించింది. గురువారం కరీబియన్ గడ్డపై అఫ్గనిస్థాన్(Afghanistan)పై జయభేరి మోగించింది. కెన్సింగ్టన్ ఓవల్‌లో కదనోత్సాహంతో కనిపించిన రోహిత్ సేన కాబూలీ టీమ్‌పై 47 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత సూర్యకుమార్ యాదవ్(53) విధ్వంసానికి హార్దిక్ పాండ్యా(32) మెరుపులు తోడవ్వగా.. ప్రత్యర్థికి భారత జట్టు భారీ లక్ష్యాన్నినిర్దేశించింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ మొదలెట్టిన అఫ్గనిస్థాన్ ఆది నుంచి తడబడింది. స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా(3/7) సూపర్ స్పెల్‌తో టీమిండియాను గెలుపు వాకిట నిలిపాడు. కుర్రాడు అర్ష్‌దీప్ సింగ్(3/36) సైతం ఓ చేయి వేయడంతో భారత్ మెగా టోర్నీ రెండో దశలోనూ తమ ఆటకు తిరుగులేదని నిరూపించింది.
తొమ్మిదో సీజన్లో జోరుమీదున్న టీమిండియా సూపర్ 8 లోనూ గర్జించింది. మిస్టర్ 360 సూర్య(53) మెరుపులతో భారీ స్కోర్ చేసినా భారత్.. ఆ తర్వాత యార్కర్ కింగ్ బుమ్రా(), అర్ష్‌దీప్ సింగ్()ల విజృంభనతో అఫ్గనిస్థాన్‌ను చిత్తు చేసింది. రోహిత్ సేన దెబ్బకు లీగ్ దశను ఓటమితో ముగించిన అఫ్గన్ సూపర్8లోనూ అదే బాటలో నడిచింది. 182 పరుగుల ఛేదనలో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. అయితే.. బౌండరీలతో చెలరేగాలనుకున్న రహ్మనుల్లా గుర్బాజ్(11)ను బుమ్రా వెనక్కి పంపి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఓవర్లో .. ఇబ్రహీం జద్రాన్(8). రోహిత్‌కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు.
మళ్లీ బంతి అందుకున్న బుమ్రా హజ్మతుల్లా జజాయ్(2)ను వెనక్కి పంపాడు. అంతే.. అఫ్గన్ జట్టు పవర్ ప్లేను 35-3తో ముగించింది. ప్రస్తుతం ఆల్‌రౌండర్లు అజ్మతుల్లా ఒమర్జాయ్(26, గుల్బదిన్ నయూబ్(7)లు కాసేపు ప్రతిఘటించారు. అయితే.. 44 రన్స్ జోడించిన ఈ జంటను కుల్దీప్ విడదీశాడు. దాంతో, 67 వద్ద అఫ్గన్ నాలుగో వికెట్ పడింది. ఆ తర్వాతి ఓవర్లోనే జడేజా ఒమర్జాయ్ను పెవిలియన్ పంపి అఫ్గన్ ఓటమిని ఖాయం చేశాడు. చివర్లో.. నజీబుల్లా జద్రాన్() కాసేపు పోరాడాడు. ఆ తర్వాత అర్ష్‌దీప్ సింగ్ ధాటికి వచ్చినవాళ్లు వచ్చినట్టు పెవలియన్‌కు క్యూ కట్టారు.
కరీబియన్ గడ్డపై తొలి మ్యాచ్‌లోనే భారత జట్టుకు పరీక్ష ఎదురైంది. కెప్టెన్ రోహిత్ శర్మ(8), ఓపెనర్‌గా ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ(24)లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. రిషభ్ పంత్(20) ఉన్నంత సేపు ధనాధన్ ఆడి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. కానీ రషీద్ ఖాన్ వరుస ఓవర్లోలో ఇద్దరిన ఈ ఔట్ చేసి ఒత్తిడి పెంచాడు.
ఆ దశలో.. వరల్డ్ నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(53) క్రీజులో పాతుకుపోయాడు. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(32) అండగా తన మార్క్ షాట్లతో అఫ్గన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పాండ్యా సైతం ఉతికేయగా రన్ రేటు 6కు తగ్గలేదు. అర్ద సెంచరీ తర్వాత సూర్య ఔటయ్యాక ఇక నా వంతు అన్నట్టు పాండ్యా బ్యాట్ ఝులిపించాడు. 20వ ఓవర్లో.. అక్షర్ పటేల్(12 నాటౌట్) రెండు బౌండరీలో జట్టు స్కోర్ 180 దాటింది. దాంతో, టీమిండియా ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
Innings break!
A blazing counter-attacking fifty from @surya_14kumar powers #TeamIndia to 181/8 👏👏
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/xtWkPFabs5#T20WorldCup | #AFGvIND pic.twitter.com/yvuQbiVbN2
— BCCI (@BCCI) June 20, 2024