ICC Rankings | దుబాయ్: పెర్త్ టెస్టులో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కడంలో కీలకపాత్ర పోషించిన టీమ్ఇండియా తాత్కాలిక సారథి జస్ప్రీత్ బుమ్రా, యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఐసీసీ టెస్టు ర్యాంకులలో దుమ్ములేపారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలర్ల జాబితాలో బుమ్రా.. 2 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. పెర్త్ టెస్టులో బుమ్రా (8/72) అద్భుతంగా రాణించాడు. ఈ క్రమంలో బుమ్రా కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు (883) సాధించడం విశేషం.
రబాడా, హాజిల్‌వుడ్, అశ్విన్ తదుపరి స్థానాల్లో నిలిచారు. బ్యాటర్ల విషయానికొస్తే పెర్త్ టెస్టుకు ముందు 4వ స్థానంలో ఉన్న జైస్వాల్.. ఆ మ్యాచ్‌లో సెంచరీ (161) చేయడంతో రెండు ర్యాంక్‌లు పైకి ఎగబాకాడు. రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా విలియమ్సన్, బ్రూక్, మిచెల్ వరుసగా 3,4,5 ర్యాంక్‌ల్లో ఉన్నారు. రిషభ్ పంత్ 6వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా తొలి టెస్టులో శతకం బాదిన విరాట్ కోహ్లీ 9 ర్యాంక్‌లు మెరుగుపరుచుకుని 13వ ర్యాంక్‌కు చేరాడు.