Mumbai | కోయంబత్తూరు: బుచ్చిబాటు టోర్నీలో స్టార్లతో కూడిన ముంబై క్రికెట్ జట్టు దారుణ పరాభవానికి గురైంది. తమిళనాడు నిర్దేశించిన 510 పరుగుల భారీ ఛేదనలో ముంబై.. 223 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తమిళనాడు 286 రన్స్ తేడాతో ఘన విజయం నమోదుచేసి సెమీస్లోకి ప్రవేశించింది.
శ్రేయస్ అయ్యర్ (22) విఫలమవగా సర్ఫరాజ్ డకౌట్ అయ్యాడు. చేతి గాయం కారణంగా సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు రాలేదు. తమిళనాడు బౌలర్లలో అచ్యుత్, సాయి కిషోర్ తలా మూడు వికెట్లు తీశారు.