SLW vs ENGW : మహిళల వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (117) సెంచరీతో చెలరేగింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సాయంతో జట్టుకు కొండంత స్కోర్ అందించింది. ప్రేమదాస మైదానంలో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన ఆమె. ఎడాపెడా ఉతిక్తే బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు భారీ స్కోర్ అందించింది. తోడ్పాడునందించగా నిర్ణీత ఓవర్లలో 253 రన్స్ చేసింది ఇంగ్లండ్.
వరల్డ్ కప్‌లో ఇంగండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ జోరు కొనసాగిస్తోంది. తోటి బ్యాటర్లు విఫలమైనా ధనాధన్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకుంటోంది. గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన తను శనివారం కొలంబోలో శ్రీలంకపైనా దంచేసింది. ఓవైపు వికెట్లు పడుతున్నా లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగిన బ్రంట్ ఖతర్నాక్ సెంచరీ బాదింది. వరల్డ్ కప్‌లో ఆమె ఐదో సెంచరీతో విజృంభించగా లంకకు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Nat Sciver-Brunt, a World Cup legend 💪 #CWC25 pic.twitter.com/AITYJ8k1AN
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2025
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నాలుగో ఓవర్లోనే ఓపెనర్ అమీ జోన్స్(11) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత టమ్మీ బ్యూమంట్(32) అండగా.. హీథర్ నైట్ (29) ఇన్నింగ్స్ నిర్మించింది. కానీ, ఈ జోడీని సుగంధ కుమారి విడదీయగా 49కే రెండే వికెట్ పడింది. పవర్ ప్లేలోనే కష్టాల్లో జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్న నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. నైట్‌తో కలిసి స్కోర్ బోర్డును నడింపిచి స్కోర్ వంద దాటించింది. ప్రమాదకరంగా మారిన ఈ ద్వయాన్ని రణవీర విడదీయగా103 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది.
నైట్ వెనుదిరిగాక సోఫియా డంక్లే(18)తో కలిసి బ్రంట్ చెలరేగింది. కానీ, డంక్లేను కవిష దిల్మరి రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ పంపింది. దాంతో, వీరి 37 పరుగుల భాగస్వా్మ్యాన్ని విడదీసింది. ఆ కాసేపటికే రణవీర తిప్పేయగా ఎమ్మా లాంబ్ (13), ఆల్‌రౌండర్ అలిసే క్యాప్సే(0)లు వెనుదిరిగారు. 168కే ఆరు వికెట్లు పడినా బ్రంట్ మాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు.
What a way to bring up a #CWC25 ton, Nat Sciver-Brunt 🙌
Watch #ENGvSL LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29 pic.twitter.com/QQkRSFIpjk
— ICC Cricket World Cup (@cricketworldcup) October 11, 2025
చార్లీ డీన్ (19) జతగా రెచ్చిపోయిన ఆమె సుగంధ కుమారి వేసిన 49వ ఓవర్లో సిక్సర్‌తో శతకం సాధించింది బ్రంట్. వంద తర్వాత కూడా జోరు తగ్గించిన ఆమె ప్రబోధిని వేసిన చివరి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో స్కోర్ 250 దాటించింది. అయితే.. ఐదో బంతికి పెద్ద షాట్ ఆడి బౌండరీ వద్ద చిక్కింది. దాంతో, ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.