ECB : స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వెనకబడిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌పై గురి పెట్టింది. గాయంతో పొట్టి సిరీస్ చివరి మూడు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (Nat Sciver Brunt) కెప్టెన్‌గా కోలుకోవడంతో వన్డే ఫైట్‌కు సిద్ధమవుతోంది ఆతిథ్య జట్టు. భారత జట్టుతో జరుగబోయే మూడు వన్డేల కోసం సెలెక్టర్లు మంగళవారం బలమైన స్క్వాడ్‌ను ప్రకటించారు. 15మందితో కూడిన బృందంలో నంబర్ 1 బౌలర్ ఎకిల్‌స్టోన్, బౌచర్ చోటు దక్కించుకున్నారు.
పొట్టి సిరీస్ తదుపరి మ్యాచ్‌లకు దూరమైన నాట్ సీవర్ బ్రంట్ కోలుకొని ఫిట్నెస్ సాధించింది. ఆమె వన్డే సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతుందని ఆశిస్తున్నాం. టీ20లో భారత జట్టు అద్భుతంగా ఆడి మమ్మల్ని ఓడించింది. ఈ సిరీస్‌లో జట్టుగా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. వన్డే సిరీస్‌లో నిలకడగా ఆడడంపై మేము దృష్టి సారిస్తున్నాం అని ఇంగ్లండ్ కోచ్ చార్లొట్టె ఎడ్వర్డ్స్ వెల్లడించింది.
ODI Cricket on the horizon 👀
Our squad to play India has just dropped 👇
— England Cricket (@englandcricket) July 8, 2025
టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్ సౌంథాంప్టన్ వేదికగా జూలై 16న మొదలవ్వనుంది. 19న లార్డ్స్, 22న చెస్టర్ లీ స్ట్రీట్‌లో తదుపరి రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ రెండు మ్యాచుల్లో జయభేరి మోగించింది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 వికెట్లతో గెలుపొంది సిరీస్‌లో నిలిచింది. నాలుగో టీ20 మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో జూలై 9న, ఐదోది బర్మింగ్హమ్లో జూలౌ 12న జరుగనుంది.
ఇంగ్లండ్ వన్డే స్క్వాడ్ : నాట్ సీవర్ బ్రంట్(కెప్టెన్), ఎమ్ అర్లాట్ సోఫియా డంక్లే, ఎమ్మా లాంబ్, టమ్మీ బ్యూమంట్(వికెట్ కీపర్), అమీ జోన్స్(వికెట్ కీపర్), ఎమ్మా క్రాస్, అలిసే డేవిడ్సన్ రిచర్డ్స్, చార్లీ డీన్ సోఫీ ఎకిల్‌స్టన్ లారెన్ ఫైలెర్ మియా బౌచియర్, అలిసే క్యాప్సే, కేట్ లిన్సే స్మిత్, లారెన్ బెల్.