welfare schemes | సుల్తానాబాద్ రూరల్, జులై 8: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరిపల్లి, నారాయణపూర్, కోదురుపాక, దేవునిపల్లి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. ఈ సందర్భంగా కందునూరిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని హనుమండ్ల పల్లి గ్రామాల్లోని హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు చేసి, ఆలయ ఆవరణలో కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
గ్రామంతో పాటు ఆయా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి, అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపీడీవో దివ్యదర్శనరావు, నాయకులు పన్నాల రాములు, పన్నాల స్వరూప, పన్నాల తిరుపతి, దామోదర్ రావు, చిలుక సతీష్, కల్లేపల్లి జానీ, అంజయ్య, కొమురయ్య, రాజలింగంతోపాటు తదితరులు పాల్గొన్నారు.