SLW vs ENGW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ విజయ గర్జన కొనసాగుతోంది. తొలి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిచిన ఫేవరెట్ శ్రీలంకనూ ఓడించింది. నాట్ సీవర్ బ్రంట్(117) కెప్టెన్ శతకంతో భారీ స్కోర్ అందించగా.. బంతితో సోఫీ ఎకిల్‌స్టోన్ (4-17) మ్యాజిక్ చేసింది. లంక మిడిలార్డర్‌ను కూల్చిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లంకను ఓటమి అంచుల్లోకి నెట్టింది. బ్రంట్ కూడా రెండు వికెట్లు తీయగా ఆతిథ్య జట్టు పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది. వరుసగా మూడో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిందీ మాజీ ఛాంపియన్.
ఉపఖండంలో జరుగుతున్న పదమూడో సీజన్ వన్డే వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ జోరు చూపిస్తోంది. తొలి పోరులో దక్షిణాఫ్రికాను, ఆపై బంగ్లాదేశ్‌ను వణికించిన ఇంగ్లండ్.. కో హోస్ట్ శ్రీలంకను మట్టికరిపించింది. కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ సుడిగాలి సెంచరీతో విరుచుకుపడగా లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ ఛేదనలో ఆరంభం నుంచి తడబడిన ఆతిథ్య జట్టు ఏదశలోనూ విజయం దిశగా సాగలేదు.
England make it three out of three and go top of the #CWC25 table after beating Sri Lanka 👏#ENGvSL 📝: https://t.co/Sx63MzedY0 pic.twitter.com/DLELFpKDYn
— ICC (@ICC) October 11, 2025
సొంతగడ్డపై చెలరేగి ఆడతారనుకుంటే శ్రీలంక బ్యాటర్లు నిరాశపరిచారు. ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్(4-5) విజృంభణతో మేము ఆడలేమంటూ డగౌట్‌కు క్యూ కట్టారు. విష్మీ గుణరత్నే (15) కాసేపు నిలబడినా.. చార్లీ డీన్ ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత ఎకిల్‌స్టోన్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ.. క్రీజులో కుదురుకున్న ఓపెనర్ హాసిని పెరీరా(35)ను, హర్షిత సమరవిక్రమ (33)లను ఔట్ చేసింది.
𝐏𝐫𝐢𝐦𝐞 𝐒𝐨𝐩𝐡𝐢𝐞 𝐄𝐜𝐜𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐨𝐧 𝐝𝐢𝐬𝐩𝐥𝐚𝐲! 🔥
3 wickets, 3 maidens, only 4 runs in 5 overs — Sri Lanka restricted to 109/4 after 27 overs! 🏏#CricketTwitter #CWC25 #SLvENG pic.twitter.com/7twZn37pTH
— Female Cricket (@imfemalecricket) October 11, 2025
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే కవిష దిల్హరి(4)ను పెవిలియన్ పంపి లంకను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటపట్టు (15) కూడా పెద్ద షాట్లు ఆడలేకపోయింది. ఆమె కూడా ఎకిల్‌స్టోన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో 116 వద్ద లంక సగం వికెట్లు పడ్డాయి. నాట్ సీవర్ రెండు వికెట్లు తీసి లంకన ఓటమిని ఖాయం చేయగా.. స్మిత్ వేసిన 46వ ఓవర్లో ప్రబోధిని ఔట్ కావడంతో 164కే లంక ఆలౌటయ్యింది. 89 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లండ్ ఆరు పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది.
Nat Sciver-Brunt thrives on the big stage 🔥 #CWC25 pic.twitter.com/OJw2GvSN5X
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2025
ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ విజయాల్లో కీలకం అవుతున్న కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ (117) శ్రీలంకపైనా చెలరేగింది. టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సాయంతో జట్టుకు కొండంత స్కోర్ అందించింది. ప్రేమదాస మైదానంలో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించిన ఆమె. ఎడాపెడా ఉతిక్తే బౌండరీలతో ఐదో సెంచరీ సాధించింది. టమ్మీ బ్యూమంట్(32), హీథర్ నైట్(29)లు తోడ్పాడునందించగా నిర్ణీత ఓవర్లలో 253 రన్స్ చేసింది ఇంగ్లండ్.