మస్కట్: ఆసియా కప్లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకాన్ని ముద్దాడింది. శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ పోరులో భారత్ 2-0తో చైనాను ఓడించి తృతీయ స్థానంలో నిలిచింది. షర్మిలా దేవి (13వ ని), గుర్జిత్ కౌర్ (19వ ని) మెరవడంతో భారత్ విజయం సాధించింది. ఫైనల్లో జపాన్ 4-2తో కొరియాపై విజయం.