పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో 54 కేజీల ప్రీ-క్వార్టర్ బాక్సింగ్‌లో ప్రీతి పవార్ ఓటమి పాలైంది. కొలంబియా ప్రత్యర్థి యేని మార్సిలా ఏరియస్పై తీవ్రంగా తలపడినా.. 2-3 తేడాతో ఆ బౌట్లో ప్రీతి పరాజయం చవిచూసింది. పాన్ అమెరికా గేమ్స్ చాంపియన్, ప్రపంచ రజత పతక విజేత యేని బలమైన పంచ్‌లు విసిరింది. తొలి రౌండ్లో ప్రీతి 1-4 తేడాతో ఓటమి పాలైంది. కానీ ఆ తర్వాత మెరుగ్గా రాణించింది. ఎత్తును అడ్వాంటేజ్‌గా తీసుకున్న ఆమె.. కొలంబియా క్రీడాకారిణి పంచ్‌ల నుంచి తప్పించుకున్నది. కానీ జడ్జిలను ఆకట్టుకోలేకపోయిన ప్రీతి స్వల్ప తేడాతో బాక్సింగ్ మ్యాచ్‌ను చేజార్చుకున్నది.
పురుషుల 51 కిలోల ప్రీ క్వార్టర్స్ ఫైట్‌లో అమిత్ పంగల్ ఓటమి చవిచూశాడు. మూడవ సీడ్ బాక్సర్ ప్యాట్రిక్ చేతిలో 3-2 స్కోరుతో పంగల్ ఓడిపోయాడు. కామన్వెల్త్లో కాంస్య పతకం గెలిచిన జాస్మిన్ లాంబోరియా 57 కేజీల విభాగంలో 0-5 తేడాతో టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడల్ విజేత పీలిప్పీన్స్కు చెందిన నెస్తీ పిటీసియో చేతిలో ఓటమిపాలైంది.