టోక్యో: ఇండియన్ స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్లో శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ రౌండ్ ఆఫ్ 32లో విజయం సాధించింది. ఆదివారం డొమినికాకు చెందిన హెర్నాండెజ్ గార్సియా మిగులినాతో జరిగిన బౌట్లో 4:1 తేడాతో గెలిచి రౌండ్ ఆఫ్ 16లో అడుగుపెట్టింది. మూడు రౌండ్లలోనూ మేరీ కోమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. లండన్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచిన తర్వాత.. రియోకు క్వాలిఫై కాలేకపోయినా ఆమె.. ఈసారి ఎలాగైనా పతకం గెలవాలన్న పట్టుదలతో ఉంది.
#TeamIndia | #Tokyo2020 | #Boxing
— Team India (@WeAreTeamIndia) July 25, 2021
Women's Fly Weight 48-51kg Round of 32 Results@MangteC के पंच में है दम। Mary kick starts her #Olympics campaign on a strong note, dominating Garcia Hernandez. What a power packed bout by our champ #RukengeNahi #EkIndiaTeamIndia #Cheer4India pic.twitter.com/4kE6vfspd2