IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) నిలకడలేమితో భారీ మూల్యం చెల్లించుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమై ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. వాంఖడేలోని స్లో పిచ్ మీద ముంబై బౌలర్ల ధాటికి స్టార్ ఆటగాళ్లు చేతులెత్తేయగా ఓపెనర్ అభిషేక్ శర్మ(40), హెన్రిచ్ క్లాసెన్(37)లు అద్భుతంగా ఆడారు. 163 పరుగుల ఛేదనలో విల్ జాక్స్(36), హార్దిక్ పాండ్యా(21) ధనాధన్ ఆడారు. కమిన్స్(3-26) కీలక సమయాల్లో వికెట్లు తీసినా లాభం లేకపోయింది. 18 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ జట్టుకు 4 వికెట్ల విజయాన్ని అందించాడు.
సొంతమైదానంలో ముంబై ఇండియన్స్ గర్జించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో.. సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. మొదట హైదరాబాద్‌ను 162కే కట్టడి చేసిన ముంబై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది. షమీ, కమిన్స్.. తొలి రెండు ఓవర్లలో 7 రన్స్ ఇచ్చారు. అయితే.. షమీ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్సర్లతో విరుచుకుపడిన రోహిత్ శర్మ(26)ను కమిన్స్ ఔట్ చేశాడు. దాంతో, 32 వద్ద ముంబై తొలి వికెట్ పడింది. ఆ తర్వాత రియాన్ రికెల్టన్(31), విల్ జాక్స్(36)లు సాధికారికంగా ఆడి రెండో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జీషన్ అన్సారీ బౌలింగ్‌లో ఔటైన రియాన్ నో బాల్‌తో బతికిపోయాడు. అయితే.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో హెడ్ చేతికి చిక్కాడు.
Applying the finishing touches 🤌
🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)
Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF
— IndianPremierLeague (@IPL) April 17, 2025
ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(26) ధాటిగా ఆడి లక్ష్యాన్ని కరిగించాడు. మూబో వికెట్‌కు జాక్స్‌తో 52 రన్స్ రాబట్టి జట్టును గెలుపు దిశగా నడిపాడు. అయితే..13వ ఓవర్లో సూర్యను ఔట్ చేసిన కమిన్స్ ఈ జోడీని విడదీశాడు. అప్పటికి ముంబై విజయానికి 44 బంతుల్లో 42 రన్స్ కావాలంతే. క్రీజులో పాతుకుపోయిన జాక్స్‌ను సైతం ఔట్ చేసిన కమిన్స్ సన్‌రైజర్స్ అభిమానుల్లో ఆశలు రేపాడు. కానీ, హార్దిక్ పాండ్యా(21) తిలక్ వర్మ(18)లు పట్టుదలగా ఆడారు. కమిన్స్ బౌలింగ్‌లో రెండు ఔండరీలు బాదిన పాండ్యా.. హర్షల్ పటేలో ఓవర్లో 6, 4 సంధించాడు. విజయానికి ఒక్క పరుగు అవసరం కాగా.. పాండ్యా వెనుదిరిగగా.. నమన్ ధిర్(0) ఎల్బీగా ఔటయ్యాడు. అయితే.. తికల్ అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు వాంఖడేలో తడబడ్డారు. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి భారీ షాట్లు ఆడలేకపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(40) మెరుపు ఆరంభాన్ని ఇవ్వడంతో మరోసారి భారీ స్కోర్ ఖాయం అనిపించింది. కానీ, పవర్ ప్లే తర్వాత ముంబై బౌలర్లు అనూహ్యాంగా పుంజుకొని.. వరుసగా వికెట్లు తీశారు. ఇషాన్ కిషన్(2) మరోసారి విఫలమవ్వగా, నితీశ్ రెడ్డి(19) స్లో పిచ్ మీద పెద్ద షాట్లు ఆడలేకపోయారు. అయితే.. హెన్రిచ్ క్లాసెన్(37) ఆఖర్లో అనికేత్ వర్మ (18 నాటౌట్) బ్యాట్ ఝులిపించారు. చాహర్ బౌలింగ్‌లో ఈ కుర్ర హిట్టర్ వరుసగా 6, 4, 4, 6 బాదడంతో స్కోర్ 130 దాటింది. 160 దాటించారు. పాండ్యా వేసిన 20 ఓవర్లో అనికేత్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆఖరి బంతిని కెప్టెన్ కమిన్స్(8 నాటౌట్) లెగ్ సైడ్ పడిన బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. ఆఖరి మూడు ఓవర్లలో 47 రన్స్ రావడంతో ముంబైకి హైదరాబాద్ మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది.