IPL 2025 : ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాపార్డర్ కుప్పకూలింది. పవర్ ప్లేలో రికార్డు స్కోర్ కొట్టిన జట్టు అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(2-8) విజృంభణతో 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడింది ఆరెంజ్ ఆర్మీని అనికేత్ వర్మ(2), హెన్రిచ్ క్లాసెన్(9)లు ఆదుకునే పనిలో ఉన్నారు. పవర్ ప్లేలో సన్‌రైజర్స్ స్కోర్.. 24-4.
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ పాండ్యా హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దాంతో, ఇక పరుగుల విందే అనుకున్నారు అభిమానులు. కానీ, రెండో ఓవర్లోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్(0)ను బౌల్ట్ డకౌట్‌గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(1) సైతం దీపక్ చాహర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి చిక్కాడు. బంతి గ్లోవ్స్, బ్యాట్‌కు తగల్లేదు, కానీ, అతడు రివ్యూ కూడా తీసుకోకుండానే పెవిలియన్ చేరాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే.. అభిషేక్ శర్మ(8), నితీశ్ కుమార్ రెడ్డి(2)లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో, 14 పరుగులకే కమిన్స్ సేన నలుగురు ప్రధాన ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది.