SAW vs AUSW : మహిళల టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్ తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా (South Africa) అమ్మాయిలు కుమ్మేశారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) బౌలర్లను ఉతికేస్తూ అన్నెకె బొస్చ్(77 నాటౌట్) విధ్వంసక అర్ధ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(47) ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడింది. ఇంకేముంది ఆరుసార్లు చాంపియన్ ఆసీస్ ఇంటిదారి పట్టగా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్‌లో సఫారీ జట్టు గెలుపు గర్జన చేసింది. వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్‌పై ఏనాడూ గెలవని దక్షిణాఫ్రికా ఈసారి ఏకంగా 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఫైనల్ చేరాలంటే ఛేదించాల్సిన లక్ష్యం పెద్దది కాదు. కానీ, ప్రత్యర్థి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా. అయినా సరే దక్షిణాఫ్రికా అమ్మాయిలు దంచి కొట్టారు. ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ఆసీస్ పుంజుకుంటుందని తెలిసిన కెప్టెన్ లారా వొల్వార్డ్త్(42) ఓపెనర్ తంజిమ్ బ్రిస్ట్(15)లు పవర్ ప్లేలో ఉతికేశారు. అయితే.. బ్రిస్ట్ను సథర్లాండ్ బౌల్డ్ చేయంతో కంగారూలు ఊరట చెందారు. కానీ, ఆ తర్వాత వొల్వార్డ్త్, అన్నెకె బాస్చ్(74 నాటౌట్)లు భారీ షాట్లు ఆడడంతో స్కోర్ 6 ఓవర్లకు 43కు చేరింది. ఈ ఇద్దరూ ధనాధన్ ఆడుతూ లక్ష్యాన్ని కరిగించారు.
SOUTH AFRICA HAVE DONE THE UNTHINKABLE!
Six-time champions Australia are out of the #T20WorldCup 🤯
SCORECARD: https://t.co/WAgm3oN9pc pic.twitter.com/Kch8eVfrnw
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2024
వరేహం వేసిన 12వ ఓవర్లో బోస్చ్ రెచ్చిపోయింది. మిడ్‌వికెట్ దిశగా వరుసగా 4, 6 బాదింది. మరుసటి ఓవర్లోనూ 4, 2తో బోస్చ్ హాఫ్ సెంచరీ సాధించింది. విజయానికి 14 పరుగులు అవసరం అనగా.. సథర్లాండ్ ఓవర్లో లారా ఔట్ అయింది. దాంతో, 96 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన చ్లొయె ట్రయాన్(1)తో కలిసి బోస్చ్ లాంఛనం పూర్తి చేసింది.
లీగ్ దశలో దుమ్మురేపిన ఆస్ట్రేలియా బ్యాటర్లు సెమీ ఫైనల్లో దంచలేకపోయారు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైంది. టాస్ గెలిచిన సఫారీ సారథి లారా వొల్వార్డ్త్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగారు. డేంజరస్ ఓపెనర్ గ్రేస్ హ్యారిస్(1)ను ఔట్ చేసిన ఖాక సఫారీలకు బ్రేకిచ్చింది. ఆ తర్వాత జార్జియా వరేహం(5)ను మరినే కాప్ పెవిలియన్ పంపింది. దాంతో, 18 పరుగులకే రెండు కీలక వికెట్లు పడ్డాయి.
🔥 40 runs in the last four overs!
Strong finish from Perry and Litchfield 👏
FOLLOW: https://t.co/WAgm3oN9pc | #T20WorldCup pic.twitter.com/cyGAy0l8yu
— ESPNcricinfo (@ESPNcricinfo) October 17, 2024
ఆ దశలో బేత్ మూనీ(44) అండగా కెప్టెన్ తహ్లియా మెక్‌గ్రాత్(27) కీలక ఇన్నింగ్స్ ఆడింది. భారీ షాట్లకు వెళ్లకుండా స్కోర్‌బోర్డును నడిపించింది. అయితే.. లాబా ఓవర్లో మెక్‌గ్రాత్ ఇచ్చిన క్యాచ్‌ను డెర్కెసెన్ సులువుగా అందుకుంది. అంతే.. 68 వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. ఇక ఆస్ట్రేలియా స్కోర్ 100 దాటడం కష్టమే అనుకన్న వేళ.. మూనీ కూడా రనౌట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆల్‌రౌండర్ ఎలీసా పెర్రీ(31), ఫొబే లిచ్‌ఫీల్డ్(16 నాటౌట్)లు ధాటిగా ఆడారు. ఆఖరి ఓవర్లలో బౌండరీలతో విరుచుకుపడి జట్టుకు స్కోర్ 130 దాటించారు.