Border Gavaskar Trophy | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియాను ఆస్ట్రేలియా బౌలర్లు వణికిస్తున్నారు. వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాకు విరాట్ కోహ్లీ(22), శ్రీకర్ భరత్ (17) రూపంలో మరో షాక్ తగిలింది. టాడ్ మార్ఫీ వేసిన 22 ఓవర్ లో వికెట్ల ముందు కోహ్లీ దొరికిపోగా.. నాథన్ లైయన్ వేసిన 25 ఓవర్ లో శ్రీకర్ భరత్ ఔటయ్యాడు. దీంతో టీమిండియా తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి 7 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్(5), అశ్విన్ (0) ఉన్నారు.
అంతకుముందు మొదటి 11.2 ఓవర్లలోనే కెప్టెన్ రోహిత్ శర్మ (12), శుభ్మన్ గిల్ (21) శ్రేయస్ అయ్యర్, పుజారా(1), రవీంద్ర జడేజా (04)ల రూపంలో భారత్ వరుస వికెట్లు కోల్పోయింది.