Border–Gavaskar Trophy | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ఆట మొదలైంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి బుధవారం తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. లబుషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఫర్వాలేదనిపించారు. మన బౌలర్లలో జడేజా 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.
రెండో రోజు ఆట మొదలు
గురువారం రెండో రోజు ఆట మొదలుకాగా.. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. మొదటి ఐదు ఓవర్లు సిరాజ్, జడేజా బౌలింగ్ వేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ.. స్పిన్నర్లను రంగంలోకి దింపుతున్నాడు. దీంతో 65 ఓవర్లు ముగిసేసరికి అసీస్ స్కోరు 172/4.గా ఉంది. క్రీజులో కామెరూన్ గ్రీన్ (19), హాండ్స్‌కాంబ్ (19) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 71 పరుగుల ఆధిక్యంలో ఉంది.