Border–Gavaskar Trophy | బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా స్పిన్నర్ల ధాటికి టీమిండియా వరుస వికెట్లు కోల్పోతుంది. ఇప్పటికే ఆసీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ కునెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ (12), శుభ్‌మన్ గిల్ (21), శ్రేయస్ అయ్యర్ వికెట్లు కూల్చగా.. సీనియర్ స్పిన్నర్ నాథన్ లియోన్‌ను పుజారా(1), రవీంద్ర జడేజా (04)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఆరంభంలోనే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
అంతకుముందు మూడో టెస్టులో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుని ఆస్ట్రేలియాకు బౌలింగ్ అప్పగించింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ని తప్పించి అతడి స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని జట్టులోకి తీసుకున్నారు.