Youth Olympics | న్యూఢిల్లీ: డాకర్(సెనెగల్) వేదికగా 2026లో జరిగే ప్రతిష్ఠాత్మక యూత్ ఒలింపిక్స్‌లో భారత పతక అవకాశాలకు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. భారత్ కచ్చితంగా పతకాలు సాధిస్తుందనుకున్న షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్, హాకీ లాంటి క్రీడాంశాలను యూత్ ఒలింపిక్స్ నుంచి తీసేశారు.
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) ఎగ్జిక్యూటివ్ బోర్డు గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. 2018లో జరిగిన యూత్ గేమ్స్‌లో భారత్‌కు షూటింగ్లో నాలుగు, హాకీలో రెండు, వెయిట్‌లిఫ్టింగ్ ఒక పతకం వచ్చింది. రానున్న యూత్ ఒలింపిక్స్‌లో భారత పతకాలపై ప్రభావం పడనుంది.