హైదరాబాద్ : ఐపీఎల్ 2026 సీజన్లో స్వింగ్ కింగ్, టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvneshwar Kumar) అదరగొడుతున్నాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఫర్పుల్ క్యాపు రేసులో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో క్వాలిఫయర్1లో గుజరాత్ టైటాన్స్ (GT) పై ఆర్సీబీ(RCB) జట్టు విజయం సాధించిన అనంతరం తమ జట్టు విజయ రహాస్యలను, బౌలింగ్ ప్రణాళికల గురించి తన అనుభవాలను పంచుకున్నాడు. జట్టు విజయాలలో గణాంకాల (Data) పాత్ర ఉందన్నారు.
అయితే దానిపైనే 100 శాతం ఆధారపడబోమని స్పష్టం చేశారు. కొత్తగా ఆడే ఆటగాళ్లు ఏదైనా కొత్త ప్రయోగాలు చేసినప్పుడు, వారి డేటాను నిశితంగా పరిశీలిస్తామని భువీ పేర్కొన్నారు. ప్రత్యర్థి బ్యాటర్లను భారీ షాట్లు ఆడకుండా కట్టడం చేయడం, ఎల్బీడబ్ల్యూ లేదా బౌల్డ్ చేయడంపై దృష్టి పెడుతామని పేర్కొన్నారు. మా అనుభవం (భువీ, జోష్ హేజిల్‌వుడ్) కూడా జట్టుకు ఉపయోగపడుతుందన్నారు. సహాయక సిబ్బంది వారు అందిస్తున్న చిన్న చిన్న మెళకువలు మాకు బాగా కలిసివస్తున్నాయి.
ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు చేరుకోవడంతో తెరవెనుక పనిచేసిన సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా, భువనేశ్వర్ ఈ సీజన్లో 15 మ్యాచ్‌లలో 18.15 సగటుతో, 8.00 ఎకానమీ రేటుతో 26 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 4/23. ఆర్సీబీ ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరడం ఇది5వ సారి. ముంబై ఇండియన్స్ (6 సార్లు ఫైనల్స్‌కు చేరి, 5సార్లు టైటిల్ గెలుచుకుంది). చెన్నై సూపర్ కింగ్స్ (10 సార్లు ఫైనల్స్‌కు చేరి,5సార్లు టైటిల్ గెలుచుకుంది).