ఢిల్లీ: టీ20ల్లో సోనమ్ యెషే సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈనెల 26న మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో యెషే.. 4 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. తద్వారా అంతర్జాతీయ పురుషుల టీ20ల్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
భూటాన్ నిర్దేశించిన 127 పరుగుల ఛేదనలో బ్యాటింగ్‌కు వచ్చిన మయన్మార్.. యెషే లెఫ్టార్మ్ స్పిన్ దాడితో 45 పరుగులకే కుప్పకూలింది. యెషేకు ముందు అంతర్జాతీయ స్థాయిలో గానీ ఫ్రాంచైజీల్లో గానీ ఇలాంటి ప్రదర్శనను ఎవరూ నమోదుచేయలేదు. యెషేకు ముందు టీ20ల్లో మలేషియా బౌలర్ స్యాజ్రుల్ ఇద్రుస్.. 2023లో చైనాతో మ్యాచ్‌లో 7/8 ప్రదర్శన చేశాడు.