న్యూఢిల్లీ: భూటాన్ స్పిన్ బౌలర్ సోనమ్ యేషే(Sonam Yeshey) చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. భూటాన్‌లోని గెలపు సిటీలో మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ 26వ తేదీన ఈ మ్యాచ్ జరిగినట్లు తెలుస్తోంది. 22 ఏళ్ల ఆ బౌలర్ ఏడు పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భూటాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 రన్స్ చేసింది. అయితే టార్గెట్ చేస్తున్న సమయంలో మయన్మార్ జట్టు కేవలం 45 రన్స్‌కే ఆలౌటైంది. భూటాన్ క్రికెట్ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్‌లో ఈ అంశాన్ని పోస్టు చేసింది. సోనమ్ యేషే అసాధారణ రికార్డు నెలకొల్పాడని, 7 పరుగులు ఇచ్చి8 వికెట్లు తీసుకున్నాడని, ఇది వరల్డ్ రికార్డు అని, ఇది ఎంతో అరుదైన ఘటన అని ఆ పోస్టులో పేర్కొన్నారు.
ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కానీ, ఇతర టోర్నీల్లో కానీ 8 వికెట్లు తీసుకున్న బౌలర్ లేరు. గతంలో మలేషియా పేస్ బౌలర్ సజ్రుల్ ఇద్రస్ 8 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు తీసుకున్నారు. 2023లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో ఆ ఘనత సాధించారు.
𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘 𝐌𝐀𝐃𝐄!🌍🇧🇹 𝑩𝒉𝒖𝒕𝒂𝒏’𝒔 𝑺𝒐𝒏𝒂𝒎 𝒀𝒆𝒔𝒉𝒆𝒚 𝒓𝒆𝒘𝒓𝒊𝒕𝒆𝒔 𝒕𝒉𝒆 𝒓𝒆𝒄𝒐𝒓𝒅 𝒃𝒐𝒐𝒌𝒔 𝒘𝒊𝒕𝒉 𝒂 𝑾𝑶𝑹𝑳𝑫 𝑹𝑬𝑪𝑶𝑹𝑫 𝒃𝒐𝒘𝒍𝒊𝒏𝒈 𝒔𝒑𝒆𝒍𝒍! The left-arm orthodox magician claimed 8/7 in 4 overs against Myanmar today. @ICC pic.twitter.com/OtOZofj75n
— BhutanCricketOfficial🇧🇹 (@BhutanCricket) December 26, 2025