Gautam Gambhir | సిడ్నీ టెస్టుకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చలు లీక్ కావడంపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి టెస్ట్ జరుగనున్నది. అయితే, ఈ టెస్టుకు ముందు కోచ్, ఆటగాళ్ల మధ్య జరిగిన చర్చలు మీడియాకు లీక్ కావడంపై గంభీర్ అంసతృప్తి వ్యక్తం చేశాడు. ఇది అంత మంచి విషయం కాదని హెడ్‌కోచ్ పేర్కొన్నాడు. మెల్న్బోర్డ్ టెస్టులో పరాజయం అనంతరం డ్రెసింగ్ రూమ్‌లో ఆటగాళ్ల తీరుపై గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
వ్యూహం ప్రకారం ఆడలేదంటూ ఆటగాళ్లపై మండిపడ్డట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు చేసింది చాలు అంటూ ఘరమైనట్లుగా ప్రచారం జరిగింది. సీనియర్లపై సైతం తీవ్రంగానే తప్పుపట్టినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం టీమిండియా 1-2 తేడాతో వెనుకపడింది. ఐదె టెస్టుకు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడుతూ.. కోచ్, ఆటగాళ్ల మధ్య డ్రెస్సింగ్ రూమ్ చర్చలు.. అక్కడికే పరిమితం కావాల్సిందేనని, అవి బయటకు రాకూడదని స్పష్టం చేశాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడుకునేది ఆటగాళ్ల ప్రదర్శనపైనేనని.. ఆటతీరుపై నిజాయితీగానే అక్కడ చర్చిస్తామని తెలిపాడు. ఇది చాలా కీలకమైందని హెచ్‌కోచ్ పేర్కొన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో నిజాయితీ పరులు ఉన్నంత వరకు భారత క్రికెట్ సేఫ్ హ్యాండ్స్‌లో ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఆటగాళ్లు జట్టులో ఒకే విషయం ఉంచగలదని.. అదే ప్రదర్శన మాత్రమేనని స్పష్టం చేశాడు. జట్టుకు టీమ్ స్పిరిట్ అనేది చాలా ముఖ్యమని తెలిపాడు. జట్టు ఏయే విషయాలపై పని చేయాలన్నది ప్రతి ఒక్కరికీ తెలుసునని.. టెస్టులు ఎలా గెలవాలన్న దానిపైనే తాము చర్చించామని.. సీనియర్ ప్లేయర్స్ రోహిత్, విరాట్తోనూ వ్యక్తిగతంగా మాట్లాడలేదని గంభీర్ క్లారిటీ ఇచ్చాడు.