బెంగళూరు : ప్రొ కబడ్డీ లీగ్‌లో మంగళవారం మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 18 పాయింట్ల తేడాతో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. వారియర్స్ దూకుడుకు పైరేట్స్ సమాధానం చెప్పలేకపోయింది. ఆరంభంనుంచి వారియర్స్ ఆటగాళ్లు వరుస పాయింట్లు సాధిస్తూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు.
వారియర్స్ కెప్టెన్ మనిందర్ సింగ్ అత్యధికంగా 15 పాయింట్లు సాధించగా, నితిన్ కుమార్ 14, శ్రీకాంత్ 12 పాయింట్లతో సహకరించారు. పైరేట్స్‌కు సచిన్ 14, సుధాకర్ 14, సందీప్ కుమార్ 5 పాయింట్లు సాధించారు.