ఇండోర్: భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ(Mohammed Shami).. రంజీ మ్యాచ్‌లో రాణించాడు. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడిన అతను తన బౌలింగ్‌తో ఇరగదీశాడు. మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో .. బెంగాల్ తరపున షమీ కీలకమైన నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతను మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు సంకేతాన్ని ఇచ్చాడు. ఇక రాబోయే ఐపీఎల్ వేలంపై కూడా షమీ కన్నేసినట్లు తెలుస్తోంది. 2018 తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడాడు షమీ. బుధవారం మొదట బెంగాల్ బ్యాటింగ్ చేసి 22 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ బ్యాటింగ్ చేసింది. కానీ తొలి రోజు రోజు షమీ ఖాతాలో వికెట్ పడలేదు. అయితే ఇవాళ ఉదయం రెండో రోజు కీలకమైన 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో బెంగాల్‌కు తొలి ఇన్నింగ్స్ 61 రన్స్ లీడ్ దొరికింది.