భువనేశ్వర్ : జర్మనీ, బెల్జియం హాకీ ప్రపంచకప్ టైటిల్ పోరుకు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో జర్మనీ 4-3తో ఆస్ట్రేలియాపై గెలుపొందగా, బెల్జియం షూటౌట్లో 3-2తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. తొలి సెమీఫైనల్లో చివరి క్షణాల్లో వెల్లెన్ చేసిన గోల్‌తో జర్మనీ 4-3 తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. తొలి క్వార్టర్లో హేవర్డ్ జెరెమి చేసిన గోల్‌తో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించింది.
అయితే చివరి క్షణాల్లో పీలెట్(58ని.), వెల్లెన్ నిక్లాస్(59ని.) రెండు గోల్స్‌తో జర్మనీని ఫైనల్‌కు చేర్చారు. బెల్జియం, నెదర్లాండ్స్ మధ్య జరిగిన రెండో సెమీస్‌లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్‌తో సమంగా నిలవడంతో షూటౌట్‌ను అమలుచేశారు.