ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 00:35:28

ఆమెపై విజయంతో ఈ స్థాయికి: సింధు

ఆమెపై విజయంతో ఈ స్థాయికి: సింధు

 హైదరాబాద్‌: కెరీర్‌ ఆరంభంలో ఒలింపిక్‌ చాంపియన్‌, చైనా షట్లర్‌ జురుయ్‌ లీని ఓడించడం తనలో ఆత్మవిశ్వాసం నింపిందని ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు పేర్కొంది. రియో ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి తిరిగి వచ్చాక ఒక అభిమాని తన నెల జీతాన్ని బహుమతిగా ఇవ్వడాన్ని జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పింది. ఆదివారం సింధు ఓ ఆన్‌లైన్‌ షోలో మాట్లాడుతూ.. ‘2012లో జురుయ్‌ లీపై నెగ్గడం నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఆ సమయంలో లీ.. ఒలింపిక్‌ చాంపియన్‌. 

ఆ విజయంతో నాపై నాకు నమ్మకం ఏర్పడింది. రియో ఒలింపిక్స్‌ (2016)లో రజత పతకం నెగ్గిన అనంతరం ఓ అభిమాని తన నెల  వేతనాన్ని కానుకగా ఇచ్చాడు. ఆ బహుమతి నా గుండెను పిండేసింది. ఆ తర్వాత అతడికి ఒక లేఖతో పాటు కొంత డబ్బు పంపాను’ అని చెప్పింది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా లభించిన ఈ విరామంలో బ్యాడ్మింటన్‌తో పాటు అనేక విషయాలు నేర్చుకున్నానని సింధు చెప్పుకొచ్చింది. ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లో వంట చేయడం, బొమ్మలు గీయడం వంటివి చేస్తున్నానని పేర్కొంది. logo