BCCI : అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాల్సేందేనని స్పష్టం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలనుకుంటోంది. విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు జట్టులోని సీనియర్లను డొమెస్టిక్‌లో ఆడాలని కోరుతోంది బీసీసీఐ. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిశాక వారానికే విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) షురూ కానుంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా పెట్టుకున్న రో-కో ఈట్రోఫీకి అందుబాటులో ఉంటామని ఇప్పటికే తమ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు సమాచారమిచ్చారు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ ఇటీవల కాలంలో వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెస్టు, వన్డే సారథిగా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసిన అగార్కర్ బృందం.. టీమిండియా క్రికెటర్లు దేశవాళీలో ఆడాల్సిందేనని కొత్త మెలిక పెట్టింది. దాంతో.. పదేహేనళ్లుగా డొమెస్టిక్ టోర్నీలు ఆడని మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు సైతం ‘మేము రెఢీ’ అని చెప్పేశారు.
Mandatory domestic duty 🏏
BCCI asks ODI & T20I players to feature in at least 2 Vijay Hazare Trophy matches.
Big step for Indian domestic cricket 👀 pic.twitter.com/ZQLjPxuVdN— GBB Cricket (@gbb_cricket) December 15, 2025
రాబోయే విజయ్ హజారే ట్రోఫీ కోసం తమను ఎంపిక చేయాలని వీరు ఇప్పటికే తమ రాష్ట్ర బోర్డులకు సమాచారమిచ్చారు. వీరితో పాటు సీనియర్లను కూడా ఒకట్రెండ్ మ్యాచ్‌లు ఆడించాలని భావిస్తున్న బీసీసీఐ ఈ విషయాన్ని అజిత్ అగార్కర్ ద్వారా వారికి చేరవేసింది. దాంతో.. బుమ్రా, సిరాజ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్‌లను కూడా తమతమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడడం ఖాయమనిపిస్తోంది. డిసెంబర్ 24 నుంచి వియ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది.