ముంబై: భారత క్రికెట్ జట్టుకు మరో రెండు, మూడు వారాల్లో కొత్త టైటిల్ స్పాన్సర్ రాబోతున్నట్టు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలతో టీమ్ఇండియా టైటిల్ స్పాన్సర్ నుంచి డ్రీమ్ 11 అర్ధాంతరంగా తప్పుకోవడంతో ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్‌లో భారత జట్టు జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతున్నది.
కాగా కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ టెండర్ల ప్రక్రియను ప్రారంభించగా బిడ్లు దాఖలు చేయడానికి ఈనెల 16 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆ ప్రక్రియ ముగిసిన 2, 3 వారాల్లో కొత్త స్పాన్సర్‌ను ప్రకటిస్తామని శుక్లా చెప్పారు.