గౌహతి: రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) టీమ్ మేనేజర్ రోమి బిందర్ చిక్కుల్లో పడ్డారు. గత శుక్రవారం ఆర్సీబీతో మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆయన డగౌట్లో సెల్‌ఫోన్‌తో కనిపించారు. ఈ ఘటన పట్ల బీసీసీఐ సీరియస్‌గా ఉంది. రోమి బిందర్కు ఇవాళ బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడినట్లు బిందర్‌పై ఆరోపణలు వస్తున్నాయి. టీమ్ డగౌట్లో ప్లేయర్లు ఉండే ప్రదేశంలో మేనేజర్ రోమి బిందర్ సెల్‌ఫోన్ చూస్తున్నట్లు దృశ్యాలు రిలీజ్ అయ్యాయి. పక్కనే కూర్చుకున్న వైభవ్ సూర్యవంశీ .. అతని ఫోన్‌ను తీక్షణంగా చూస్తున్నట్లు ఆ వీడియోలో ఉన్నది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో వివాదం ముదిరింది. దీనిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఐపీఎల్ చైర్మెన్ లలిత్ మోదీ కూడా డిమాండ్ చేశారు.
బీసీసీఐకి చెందిన యాంటీ కరప్షన్ అండ్ సెక్యూర్టీ యూనిట్(ఏసీఎస్‌యూ) రోమి బిందర్కు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా ఈ చర్యకు పాల్పడింది. అయితే 48 గంటల్లో ఆయన తన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. దేని కోసం రోమి బిందర్ డగౌట్ ఏరియాలో ఫోన్ పట్టుకున్నారో తన వివరణలో చెప్పాల్సి ఉంటుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఏసీఎస్‌యూ విభాగాన్ని ఆదేశించామని, దీనిపై నివేదికను ఇవ్వాలని కోరినట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్ అరుణ్ ధుమాల్ ఓ మీడియాతో తెలిపారు. అయితే ఆరోగ్య కారణాల కోసం బిందర్ ఫోన్ వాడి ఉంటారని భావిసత్ఉన్నారు.
గతంలో ఆర్ఆర్ టీమ్ మేనేజర్‌కు ఆరోగ్య సమస్యలు ఎదరయ్యాయి. నాగపూర్‌లో ఓసారి ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. మెడికల్ కారణాల చేత ఆయన తన ఫోన్‌కు డగౌట్‌కు తీసుకెళ్లే వీలు ఉంది, కానీ అక్కడ కూర్చుని ఫోన్‌ను వాడరాదు అని నియమావళి ఉన్నట్లు తెలుస్తోంది. రోమి ఇటీవల 10 కిలోల బరువు తగ్గినట్లు కొన్ని రిపోర్టుల ద్వారా తెలిసింది. అయితే రోమి మెడికల్ కండీషన్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ అధికారులు చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు.