BCCI : పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ భారత్, బంగ్లాదేశ్ బోర్డుల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. ‘ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం మా జట్టును ఇండియా పంపించమ’ని ఐసీసీకి బంగ్లా బోర్డు లేఖ రాయడంతో మొదలైన సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఐసీసీ జోక్యం చేసుకుంటుందా? లేదంటే శ్రీలంకలో బంగ్లా జట్టు మ్యాచ్‌లు ఆడిపిస్తారా? అనేది తెలియడం లేదు.ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) కీలక వ్యాఖ్యలు చేశాడు. తమకు ఐసీసీ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అన్నాడు.
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌ల వేదికల మార్పు గురించి ఐసీసీ నుంచి మాకు ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదు. చెన్నైలో లేదంటే ఇతర వేదికల్లో ఆ టీమ్‌ను ఆడించాలా? అనే విషయంపై ఇంకా ఐసీసీ ఏమీ తేల్చలేదు. ఈ అంశం మా పరిధిలో లేనిది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీకి సంబంధించిన విషయమిది. ఒకవేళ ఐసీసీ తప్పనిసరిగా వేదికలను మార్చాలని మాకు చెబితే ఆతిథ్య దేశంగా అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికైతే షెడ్యూల్లో మార్పులేమీ లేవు అని సైకియా వెల్లడించాడు.
BCCI secretary Devajit Saikia provides massive update on Bangladesh’s request for a venue change in T20 World Cup 2026https://t.co/d9yxwynDom pic.twitter.com/5EkQWUkCmB
— ET NOW (@ETNOWlive) January 12, 2026
ఇటీవల భారత్, బంగ్లాదేశ్ బోర్డుల మధ్య పెరిగిన దూరం ప్రపంచకప్ షెడ్యూల్‌పై పడేలా ఉంది. ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని బంగ్లా బోర్డు ఐసీసీకి ఈమెయిల్ పంపడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భద్రతను కారణంగా చూపిన బంగ్లా బోర్డుతో ఐసీసీ ఛైర్మన్ జై షా (Jai Shah) మాట్లాడి ఒప్పిస్తారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మ్యాచ్‌లను మా దేశంలో ఆడించేందుకు సిద్దమంటూ పాకిస్థాన్ బోర్డు ముందుకొచ్చింది. శ్రీలంకలో మైదానాలు అందుబాటులో లేకుంటే మా స్టేడియాలకు అనుమతివ్వండని పీసీబీ అంటోంది.
పొట్టి ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు కోల్‌కతాలో మూడు లీగ్ మ్యాచ్‌లు ఆడాలి. ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 8న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లండ్‌తో లిటన్ దాస్ సేన తలపడాలి. కానీ, తాజా ఉద్రికత్తల నేపథ్యంలో బంగ్లాదేశ్ బోర్డు తమ జట్టును భారత్‌కు పంపేందుకు సుముఖంగా లేదు. ఒకవేళ ఐసీసీ చెప్పినా బంగ్లా బోర్డు వినకుంటే.. కో-హోస్ట్ అయిన శ్రీలంకకు ఆ జట్టు మ్యాచ్‌లను తరలించే అవకాశముంది.
Is BCCI Aware of the Venue Change for Bangladesh’s T20 World Cup Matches? New Delhi, Jan 12 (NationPress) BCCI secretary Devajit Saikia stated that the
Board of Control for Cricket in India has not received any updates from the
International Cricket… https://t.co/WI17gPDsHn pic.twitter.com/JyTLuoRQXh— NationPress (@np_nationpress) January 12, 2026
షెడ్యూల్ ప్రకారం లంకలోని రెండు మైదానాలే ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఎంపికయ్యాయి. డిసెంబర్లో బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యను నిరసిస్తూ ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ (Mustafizur)ను తప్పించింది బీసీసీఐ. తమ పేసర్‌పై వేటును ఖండించిన బంగ్లాదేశ్ బోర్డు ప్రతిచర్యగా తమ జట్టును ప్రపంచకప్ కోసం భారత్‌కు పంపబోమని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.