లాహోర్: మరికొద్దిరోజుల్లో పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం నెలకొంది. భారత జట్టు ధరించే జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ లోగో ఉండటాన్ని బీసీసీఐ నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఐసీసీ టోర్నీలలో భాగంగా ఆతిథ్య దేశపు పేరు, లోగోను జెర్సీపై ముద్రించడం ఆనవాయితీగా వస్తోందని.. కానీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించడం లేదని పీసీబీ ఆరోపిస్తోంది.