WPL 2024 Schedule: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవిలో జరగాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కంటే ముందే మొదలుకానున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 23న మొదలై 23 రోజుల పాటు సాగే ఈ టోర్నీ.. మార్చి 17న ముగుస్తుంది. బీసీసీఐ ఇదివరకే ప్రకటించినట్టుగా రెండో సీజన్‌గా జరగాల్సి ఉన్న ఈ టోర్నీని బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ బుధవారం సాయంత్రం పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.
గత సీజన్లో మ్యాచ్‌లు అన్నీ ముంబైలో జరగగా ఈ సీజన్లో మాత్రం రెండు నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. 20 లీగ్ మ్యాచ్‌లు, రెండు నాకౌట్ మ్యాచ్‌లు (మొత్తం 22)గా సాగే ఈ టోర్నీలో.. తొలి 11 మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతాయి. రెండో సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగనుంది. ఈ సీజన్లో ప్రతి రోజూ ఒక్క మ్యాచ్ మాత్రమే నిర్వహించనున్నారు. డబుల్ హెడర్స్ లేవు.
మహిళల ప్రీమియర్ లీగ్ – 2024 షెడ్యూల్
బెంగళూరులో 11 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత టోర్నీ మొత్తం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి షిఫ్ట్ అవుతుంది. ఢిల్లీలో తొలి మ్యాచ్.. ఢిల్లీ – ముంబై మధ్య మార్చి 5న జరుగనుంది. లీగ్ మ్యాచ్‌లతో పాటు ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ కూడా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనే నిర్వహించనున్నారు. మార్చి 20 దాకా లీగ్ మ్యాచ్‌లు ఆడే ఈ సీజన్లో 22న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 22న ఫైనల్ జరగాల్సి ఉంది. గత సీజన్లో మాదిరిగానే పాయింట్ల పట్టికలో టాప్ -1లో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడో స్థానల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఎలిమినేటర్ విజేతతో టాప్ – 1 టీమ్.. మార్చి 22న ఫైనల్ ఆడనుంది.
Excitement levels 🔛 for #TATAWPL Season 2 🤩
Which fixture are you looking forward to the most? 🤔 pic.twitter.com/cM76wDwSte
— Women’s Premier League (WPL) (@wplt20) January 24, 2024
పాల్గొనే జట్లు..
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్