WPL : క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) త్వరలోనే ప్రారంభం కానుంది. ముంబైలో నిన్న వేలం ప్రక్రియ ముగియడంతో డబ్ల్యూపీఎల్ షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లో ఏయే జట్లు తలపడనున్నాయో వెల్లడించింది. మార్చి 4న ముంబైలో అట్టహాసంగా డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. 23 రోజుల వ్యవధిలో ఐదు జట్లు 20 లీగ్ మ్యాచ్‌లు, రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మార్చి 26న ఫైనల్ నిర్వహిస్తారు.
డివై పాటిల్ స్టేడియంలో మర్చి 4న జరిగే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. మార్చి 5న రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొంటాయి. అదే రోజు సాయంత్రం యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ ఉంది. ఈ లీగ్‌లో ఫైనల్ స్టేజ్ గేమ్ యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మార్చి 21న జరుగుతుంది. 24వ తేదీన రెండో ఎలిమినేటర్ పోరు ఉంటుంది. మార్చి 26న టైటిల్ పోరు జరగనుంది.
బీసీసీఐ తొలిసారి నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఓపెనర్ స్మృతి మంధాన రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆర్సీబీ రూ.3.40 కోట్ల భారీ ధరకు మంధానను కొనుగోలు చేసింది. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన భారత ప్లేయర్స్ ఎవరంటే..?
దీప్తి శర్మ – రూ.2.60కోట్లు- యూపీ వారియర్స్
జెమీమా రోడ్రిగ్స్ – రూ.2.20 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
షఫాలీ వర్మ – రూ.2 కోట్లు- ఢిల్లీ క్యాపిటల్స్
హర్మన్‌ప్రీత్ కౌర్ – రూ.1.8 కోట్లు – ముంబై ఇండియన్స్
రీచా ఘోష్ – రూ.1.90 కోట్లు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
WPL 2023 schedule: pic.twitter.com/URZfx8u43f
— Johns. (@CricCrazyJohns) February 14, 2023