BCCI: ఎందుకు ఓడిపోయారు..? రోహిత్, ద్రావిడ్‌లను వివరణ కోరిన బీసీసీఐ.. హెడ్‌కోచ్ ఏం చెప్పాడంటే..!
BCCI: ప్రపంచకప్ ఓటమికి గల కారణాలు చెప్పాలని బీసీసీఐ పెద్దలు.. కెప్టెన్, కోచ్‌లతో సమావేశమైనట్టు తెలుస్తున్నది. వరుసగా పది మ్యాచ్‌లను గెలుచుకుని తుది మెట్టుపై బొక్క బోర్లా పడటానికి కారణం...
BCCI: వన్డే వరల్డ్ కప్ ముగిసిన రెండువారాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా కెప్టెన్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌లను వివరణ కోరింది. ప్రపంచకప్ ఓటమికి గల కారణాలు చెప్పాలని బీసీసీఐ పెద్దలు.. కెప్టెన్, కోచ్‌లతో సమావేశమైనట్టు తెలుస్తున్నది. ఢిల్లీలో ఈ సమావేశం నిర్వహించగా ద్రావిడ్ నేరుగా హాజరైన ఈ మీటింగ్‌కు రోహిత్ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయినట్టు సమాచారం. ప్రపంచకప్‌లో వరుసగా పది మ్యాచ్‌లను గెలుచుకుని తుది మెట్టుపై బొక్క బోర్లా పడటానికి కారణం అహ్మదాబాద్ పిచ్ అని ద్రావిడ్ చెప్పినట్టు బోర్డు వర్గాల వినికిడి.
అహ్మదాబాద్ పిచ్ భారత్‌కు ఏమాత్రం అనుకూలించలేదని, దాని నుంచి అటు బ్యాటర్లకు గానీ ఇటు బౌలర్లకు గానీ సహకారం అందలేదని ద్రావిడ్ బోర్డు సభ్యులకు తెలిపినట్టు హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఫైనల్ పిచ్‌కు అప్పటికే పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు వాడింది. ఈ మ్యాచ్‌లో మాదిరిగానే టాస్ కీలక పాత్ర పోషించింది. పాక్‌తో పోరులో కూడా తొలుత దాయాది జట్టు బ్యాటింగ్ చేసి తడబడగా ఆ తర్వాత భారత్ లక్ష్యాన్ని ఊదిపారేసింది. ఇండియా – ఆసీస్ ఫైనల్ మ్యాచ్ లో సైతం అదే ఫలితం రిపీట్ అయింది.
Rahul Dravid said – “The Ahmedabad pitch did not turn as much as the Indian team expected in the Final of this World Cup 2023”. (To HT) pic.twitter.com/JH2ngGkZcz
— CricketMAN2 (@ImTanujSingh) December 2, 2023
ప్రపంచకప్ తర్వాత రోహిత్ లండన్‌లో గడుపుతుండగా ద్రావిడ్ మాత్రం ఇక్కడే ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశం జరిగింది దక్షిణాఫ్రికా టూర్లో భారత జట్టును ఎంపిక చేయడానికి ఏర్పాటుచేసినా బోర్డు పెద్దలు మాత్రం ద్రావిడ్, రోహిత్‌లను వివరణ కోరారు. వరల్డ్ కప్ అయిపోవడంతో తన కాంట్రాక్టు పదవీకాలం ముగిసానా బీసీసీఐ మాత్రం.. ద్రావిడ్ కాంట్రాక్టును పొడిగించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

