నిధుల గోల్మాల్?
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేర్గు, చుంచనకోట, ఆకునూరు, వేచరేణి, చిట్యాల గ్రామాలకు చెందిన రైతులు ఏర్పా టు చేసుకున్న ఫార్మర్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజింగ్ సంస్థలో నిధుల గోల్మాల్ జరిగిందని రైతులు ఆరోపించారు.
- రైతులు ఏర్పాటు చేసుకున్న ఫార్మర్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజింగ్ సంస్థ
- సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చిట్యాలలో విచారణ చేపట్టిన అధికారులు
చేర్యాల, జూలై 26: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని కడవేర్గు, చుంచనకోట, ఆకునూరు, వేచరేణి, చిట్యాల గ్రామాలకు చెందిన రైతులు ఏర్పా టు చేసుకున్న ఫార్మర్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజింగ్ సంస్థలో నిధుల గోల్మాల్ జరిగిందని రైతులు ఆరోపించారు. 2022లో ఏర్పడిన ఎఫ్‌పీవోలో ఐదు గ్రామాలకు చెందిన 380 మంది రైతులు సభ్యులు ఉండగా, ప్రారంభ సమయంలో రైతు లు రూ.3లక్షల 60వేల వాటాధనాన్ని వెచ్చించగా నాబార్డు రైతుల కోసం రూ.6 లక్షల 20వేలను మంజూరు చేసింది.
రైతుల వాటాధనం, నాబార్డు అందజేసిన సాయంతో ఎరువులు, విత్తనాలు, యంత్రాలు తదితర వాటి ని తీసుకొచ్చి సంస్థలో ఉన్న రైతులకు విక్రయించి వ్యాపారం కొనసాగించారు. మొదటి ఏడాది రూ.39 లక్షలు, రెండో ఏడాది రూ.38లక్షలు, మూడో ఏడాది రూ.18 లక్షల టర్నోవర్ జరిగినట్లు రైతులు తెలిపారు. ఇప్పటివరకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని మాసాలుగా ఎఫ్‌పీవో కొనసాగిస్తున్న తీరుపై రైతులకు అనుమానం రావడంతో సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం నాబార్డు అధికారులతో పాటు ఎఫ్‌పీవో బాధ్యు లు చిట్యాలలో విచారణ ప్రారంభించారు. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నిర్వాహకులపై మండిపడ్డారు. ఈ విషయమై వివరణ కోరేందుకు నాబా ర్డు అధికారులకు ఫోన్ చేసినప్పటికీ వారు స్పం దించడం లేదు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

