శ్రీశైలానికి 2.58 లక్షల ఇన్‌ఫ్లో
కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. పైనున్న కర్ణాటకలోని ప్రాజెక్టుల గేటన్నీ ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. అంతకంతకూ ప్రవాహం పెరుగుతున్నది.
- 24 గంటల్లో 6 అడుగులు పెరిగిన నీటిమట్టం
- వరద మరింత పెరుగుతుందని అంచనా
- జల విద్యుత్ కేంద్రాల ద్వారా సాగర్‌కు 6,744 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- నాగార్జునసాగర్‌లో 505.50 అడుగుల నీటి మట్టం
నల్లగొండ ప్రతినిధి/నందికొండ, జూలై26(నమస్తే తెలంగాణ) : కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నది. పైనున్న కర్ణాటకలోని ప్రాజెక్టుల గేటన్నీ ఎత్తడంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతున్నది. అంతకంతకూ ప్రవాహం పెరుగుతున్నది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాలతోపాటు తుంగభద్ర డ్యామ్ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2.58లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతున్నది. దాంతో గడిచిన 24 గంటల్లోనే ఇంచుమించు 6 అడుగుల మేర శ్రీశైలంలో నీటిమట్టం పెరిగింది.
24 గంటల్లోనే అదనంగా 16.52 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఆల్మట్టి, నారాయణఫూర్ రిజర్వాయర్లు ఐదు రోజుల కిందటే నిండడంతో గేట్లు ఎత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఆ నీరంతా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతున్నది. జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. ఇంకోవైపు తుంగభద్ర డ్యామ్ సైతం పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లు ఎత్తారు. తుంగభద్రలో గరిష్ట నీటి మట్టానికి కొంచెం అటూఇటూగా మెయింటెన్ చేస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి పంపుతున్నారు. రెండు ప్రాజెక్టుల నుంచి కలిసి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది.
గతేడాది వరదలను పరిశీలిస్తే ఇదే నెల 27న ఆల్మట్టి గేట్లు ఎత్తారు. ఈసారి పది రోజుల ముందుగానే గేట్లు తెరుచుకోవడంతో దిగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ సీజన్లో ఇప్పటికే 40 అడుగల మేర నీరు అదనంగా వచ్చి చేరింది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 2.49 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా 2.54లక్షల నీటిని దిగువనకు విడుదల వదులుతున్నారు.
మరోవైపు తుంగభద్ర డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,632.22 అడుగులకు గానూ 1,63 1.99 అడుగుల నీటిమట్టాన్ని నిర్వహిస్తూ ఇన్‌ఫ్లోగా వస్తున్న 98,392 క్యూసెక్కులను అంతేస్థాయిలో కిందికి పంపుతున్నారు. అలా రెండు ప్రాజెక్టుల నుంచి సాయంత్రం ఆరు గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టుకు 2.58లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. దాంతో వేగంగా నీటిమట్టం పెరుగుతున్నది.
శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 861 అడుగులకు నీరు చేరింది. పూర్తి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 109.01 టీఎంసీల మేర నీరుంది. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో నాగార్జునసాగర్‌లోనూ నీటి మట్టం స్వల్పంగా పెరిగింది. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల ద్వారా వస్తున్న నీటితో సాగర్‌లో 24 గంటల్లో 2.29టీఎంసీల నీరు వచ్చి చేరడంతో 1.40అడుగుల మేర నీటిమట్టం పెరిగింది.
శుక్రవారం సా యంత్రం ఆరు గంటల సమయానికి నాగార్జునసాగర్‌లో 505.50అడుగు ల నీటిమట్టంతో 124.16టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువన వరదల ఉధృతి ఇలాగే కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండి ఆ తర్వాత వరద నీరంతా సాగర్‌కే రానున్నది. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈసారి సాగర్ ఆయకట్టులో ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో రెండు పంటలకు నీరు అందించే అవకాశం ఉందని ఎన్ఎస్పీ అధికారులు కూడా చెబుతున్నారు.
సాగర్ డ్యామ్ భద్రతకు ఢోకా లేదు
కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరే అవకాశం ఉంది. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ కమిటీ సూచనల ప్రకారం డ్యామ్ పటిష్టతకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాం. డ్యామ్ క్రస్ట్ గేట్ల రబ్బర్ సీలింగ్, రోప్ వైర్ల మార్పిడి, గేట్లకు అమర్చిన మోటర్ల ఒరాయిలింగ్ మరమ్మతులు, ఆయిలింగ్, నిర్వహణ పనులను పూర్తి చేశాం. డ్యామ్ భద్రతకు ఢోకా లేదు. రానున్న వరదను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీటి విడుదల మంచి ఫలితాలను ఇస్తుంది. ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం పంటలకు నీటి విడుదల ఉంటుంది.
-డ్యామ్ సీఈ నాగేశ్వర్రావు
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

