Shahi Tharoor | యువ ఎంపీల కొరత.. 35 ఏండ్లలోపు వారికి 10 శాతం సీట్లు రిజర్వ్ చేయాలి: ఎంపీ శశి థరూర్
లోక్సభలో 10% స్థానాలను 35 ఏండ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.
Shahi Tharoor | న్యూఢిల్లీ: లోక్సభలో 10% స్థానాలను 35 ఏండ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో యువత స్పష్టంగా మైనారిటీగా ఉన్నదని, ఇది ప్రజాస్వామిక లోటుకు దారితీస్తుందని అందులో పేర్కొన్నారు.
మన దేశ జనాభాలో 35 ఏండ్లలోపు వయసు గలవారు 65 శాతానికిపైగా ఉన్నారని తెలిపారు. మన దేశంలో యువ ఎంపీలు తగిన సంఖ్యలో లేరని పేర్కొన్నారు. లోక్సభలో యువత కోసం కొన్ని స్థానాలను కేటాయించడం వల్ల యువతకు కూడా రాజకీయాల్లో స్థానం ఉందనే సందేశాన్ని వారికి పంపించవచ్చునని శశిథరూర్ చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

