IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్ కోసం అతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రతిష్ఠాత్మక ఈ టోర్నీని మార్చి 22 వ తేదీన ప్రారంభించేందుకు బీసీసీఐ(BCCI) ముహూర్తం ఫిక్స్ చేసింది. త్వరలోనే 17వ సీజన్ నిర్వహణ తేదీలపై అధికారిక ప్రకటన మాత్రం చేయనుంది.
అయితే.. మార్చిలోనే సార్వత్రిక ఎన్నికలు(General Elections) ఉండడంతో ఎలక్షన్ డేట్స్ వచ్చాకే ఐపీఎల్ టోర్నీ తేదీలను వెల్లడించాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో టోర్నీని విదేశాల్లో నిర్వహిస్తారనే వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ, బీసీసీఐ మాత్రం భారత్‌లోనే టోర్నీ జరిపేందుకు మొగ్గు చూపుతోంది.
ఐపీఎల్ 17వ సీజన్ ఈసారి మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2024) రెండో సీజన్ తర్వాత జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం డబ్ల్యూపీఎల్ 2024.. ఫిబ్రవరి 22న మొదలై మార్చి 17న ముగుస్తుంది. ఒకవేళ ఎన్నికల తేదీలు అడ్డుపడకుంటే.. యథావిధిగా మార్చి 22 ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీతో కెప్టెన్లు
మే 26వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 1 17వ సీజన్ పూర్తి కానుంది. అనంతరం ఐదు రోజుల్లోనే(జూన్ 1వ తేదీన) వెస్టిండీస్, అమెరికా గడ్డపై టీ20 వరల్డ్ కప్(T20 World Cup) మొదలవ్వనుంది. అందుకని 17వ సీజన్ ఫైనల్ ఆసాంతం తమ క్రికెటర్లు అందుబాటులో ఉంటారని అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే బీసీసీఐకి మాటిచ్చాయి.