Rahul Gandhi | అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్కు అనుమతి నిరాకరణ.. కారణం చెప్పాలంటూ నిరసన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్థలమైన బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించి యాత్రను ప్రారంభించాలనుకున్నారు.
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో న్యాయ యాత్రలో (Bharat Jodo Nyay Yatra) భాగంగా ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నగావ్ జిల్లాలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన సాధువు శ్రీమంత శంకరదేవ (Saint Srimanta Sankardeva) జన్మస్థలమైన బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించి యాత్రను ప్రారంభించాలనుకున్నారు. అయితే ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు తనను అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శలు చేశారు. మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం ఏంచేశాను..? మేం ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికి.. సమస్యలు సృష్టించడానికి కాదన్నారు.
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీని మినహా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎవరినీ అధికారులు ఆలయానికి అనుమతించలేదు. ఆలయం ఉన్న ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైబోరాగావ్ వద్దే రాహుల్తోపాటు నాయకులందరిని అడుకున్నారు. దీనిపై పార్టీ నేత జైరాం రమేశ్ మాట్లాడుతూ.. అక్కడికి వెళ్లాలని రాహుల్ గాంధీ అనుకున్నారు. అనుమతి కోసం మా ఎమ్మెల్యే జనవరి 11 నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఆలయానికి వస్తామని చెప్పామని, దానికి ఆలయ అధికారులు అనుమతించారని చెప్పారు. అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి రాకూడదని ఆదివారం సాయంత్రం తమకు సమాచారం అందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడివల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. కాగా, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రం అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు కొనసాగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

