మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంటును భారత్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే 2025 మహిళల వరల్డ్ కప్ హోస్టింగ్ హక్కుల కోసం బిడ్డింగ్ వేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ హక్కులు బీసీసీఐ చేతికే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అదే జరిగితే 2025లో ఈ మెగాటోర్నీ మన దేశంలోనే జరుగుతుందని సమచారం.
2013లో మహిళల వన్డే ప్రపంచకప్, 2016 టీ20 ప్రపంచకప్ భారత్‌లోనే జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక మీటింగ్ జరగనుంది. ఈ సమావేశంలోనే 2025 మహిళల ప్రపంచకప్‌తోపాటు 2024, 2026 టీ20 ప్రపంచకప్ కోసం కూడా బిడ్లను స్వీకరిస్తుందని సమాచారం. గత ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఐదో స్థానంలో నిలిచింది. అంతకుముందు 2013లో స్వదేశంలో జరిగిన టోర్నీలో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.