BCCI New Rules | టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనలో ఓటమి తర్వాత బీసీసీఐ పది పాయింట్లతో కొత్త రూల్స్‌ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లాండ్ జరిగిన సిరీస్ నుంచే అమలులోకి తీసుకువచ్చింది. కుటుంబంతో ఆటగాళ్లు కలిసి ఉండడం, ఆటగాళ్లు అందరూ కలిసి ప్రయాణించడం తదితర పది రూల్స్‌ను తీసుకువచ్చిన విషయం విధితమే. ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ సైతం ఒకే హోటల్‌కు వెళ్లేందుకు అనుమతి ఉండదు. దుబాయిలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి సైతం ఇవే నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. గంభీర్ పీఏ (పర్సనల్ అసిస్టెంట్) సైతం మరో హోటల్లోనే బస చేయాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. గతంలో ఎవరికి ఇవ్వని స్వేచ్ఛ గంభీర్‌కు బీసీసీఐ ఇచ్చింది.
సపోర్టింగ్ స్టాఫ్ నుంచి ప్రతి అంశంలోనూ అతని నిర్ణయానికి పెద్ద పీట వేసింది. ఇటీవల వరుస వైఫల్యాల నేపథ్యంలో బీసీసీఐ ఆటగాళ్లతో పాటు అటు స్టాఫ్‌కు సైతం కొత్త రూల్స్‌ను తీసుకువచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన హోం సిరీస్‌లో గంభీర్ పీఏ ప్రతి చోటా కనిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో పర్సనల్ అసిస్టెంట్ ఉన్నది ఒక హెడ్‌కోచ్ గంభీర్‌కు మాత్రమే. తాజాగా హెడ్‌కోచ్‌కు సైతం ఆటగాళ్లు, మిగతా సపోర్టింగ్ స్టాఫ్‌కు సైతం కొత్త రూల్స్‌ను తీసుకువచ్చింది. గంభీర్ మేనేజర్, పీఏ వీఐపీ బాక్స్‌లో కూర్చోవడం, జట్టు ప్రయాణించే బస్‌లో ప్రయాణించకూడదని, జట్టు ఉండే హోటల్లో ఉండకూడదని ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. హెడ్‌కోచ్ పీఏ విషయంలో ఓ అధికారి బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. జాతీయ సెలెక్టర్ల కోసం ఏర్పాటు చేసిన కారులో గంభీర్ పీఏ ఎందుకు కూర్చున్నాడు ? ప్రైవేటు వ్యక్తి మధ్య ఇతర విషయాలను చర్చించకూడదని.. అడిలైడ్‌లో వీఐపీ బాక్స్‌లో ఎందుకు ఉన్నాడు? అనే విషయాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వాస్తవానికి బీసీసీఐ డ్రెసింగ్ రూమ్ చర్చలను బయటకు లీక్ కాకుండా చూడాలని భావిస్తున్నది. గత కొన్ని నెలలుగా భారత డ్రెస్సింగ్ రూమ్ నుంచి లీక్‌లు సర్వసాధారణంగా మారాయి. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చర్చలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుంది. మరో వైపు పది పాయింట్ల రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. రాబోయే చాంపియన్స్ ట్రోఫీ సమయంలోనూ ఆటగాళ్లను కుటుంబీకులకు అనుమతి ఉండదు. ఏవైనా మినహాయింపులు కావాలని కోరుకుంటే మాత్రమే వారి ఖర్చులను ఆటగాడే భరించాల్సి ఉంటుంది. అలాగే, వ్యక్తిగత చెఫ్‌లు, హేర్ స్టయిలిస్ట్, ఏజెంట్స్‌ను సైతం నిషేధించిన విషయం తెలిసిందే.