ROKO | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది. వన్డే జట్టులో కొనసాగాలనుకుంటే దేశీయ వన్డే టోర్నమెంట్లలో పాల్గొనాలని బోర్డు చెప్పింది. ఇద్దరు సీనియర్స్ టెస్ట్, టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. ఇద్దరు వన్డే జట్టులో మాత్రమే ఆడుతున్నారు. దాంతో బోర్డు, జట్టు టీమ్ మేనేజ్మెంట్ దేశీయ క్రికెట్‌తో ఫిట్నెస్, ఫామ్‌ను నిరూపించుకోవాలని చెప్పింది.
ఓ నివేదిక ప్రకారం.. ఈ దిశలో తొలి అడుగు డిసెంబర్ 24న విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ జరుగనున్నది. డిసెంబర్ 3 నుంచి 9 వరకు జరగనున్న దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్, జనవరి 11న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ మధ్య దేశీయ క్యాలెండర్లో ఈ మ్యాచ్ ఏకైక వన్డే. రోహిత్ శర్మ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటానని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA)కి తెలియజేసినట్లు సమాచారం. అయితే, విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం స్పష్టత లేదు.
ఓ సీనియర్ బీసీసీఐ అధికారి ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. భారత్ తరఫున ఆడాలనుకుంటే.. దేశీయ క్రికెట్లో ఆడాలని బోర్డు, జట్టు నిర్వహణ వారిద్దరికీ స్పష్టం చేసింది. రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినందున.. ఫిట్నెస్, లయను కాపాడుకోవడానికి ఇది చాలా అవసరమని చెప్పారు. గత నెలలోనే సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ సైతం ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో పాల్గొనాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆటగాళ్లు అందుబాటులో ఉన్నప్పుడల్లా దేశీయ క్రికెట్ ఆడాలని ముందే స్పష్టం చేశామన్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి సుదీర్ఘ విరామం ఉన్నప్పుడు.. మిమ్మల్ని మీరు ఫామ్‌ను ప్రదర్శించేందుకు ఇదే మార్గమన్నారు.
ఈ నెల 26న మొదలుకానున్న ముష్తాక్ అలీ టీ20 టోర్నీలో రోహిత్ పాల్గొనే అవకాశం ఉంది. ఇందు కోసం ముంబయిలోని శరద్ పవార్ ఇండోర్ అకాడమీలో ప్రాక్టీస్ మొదలుపెడుతున్నాడు. ప్రసుతం కోహ్లీ లండన్‌లో ఉన్నాడు. త్వరలోనే దేశీయ సర్క్యూట్లో ఆడాలని బోర్డు ఆశిస్తోంది. ఇద్దరు గత సీజన్లో ఇద్దరూ ఒక్కో రంజీ మ్యాచ్‌లో ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో కోహ్లీ 12 సంవత్సరాల తర్వాత ఢిల్లీ తరఫున, రోహిత్ పది సంవత్సరాల తర్వాత ముంబయి తరఫున ఆడాడు. ఆ సమయంలో రోహిత్ మాట్లాడుతూ టెస్ట్ క్రికెట్‌ను క్రమం తప్పకుండా ఆడడం ప్రారంభించిన 2019 నుంచి దేశీయ క్రికెట్లో ఆడేందుకు చాలా తక్కువ సమయం మాత్రమే దొరికిందని.. ఏడాది పొడవునా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన తర్వాత కొంత విశ్రాంతి అవసరమని.. కానీ, ప్రస్తుతం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పాడు.
ట్రయల్స్‌లో కోహ్లీ, రోహిత్ పేర్లు పరిశీలనలో లేవని సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. ఇద్దరు ఆటగాళ్లు ట్రోఫీల్లోనే కాదని.. పరుగులలో కూడా భారత క్రికెట్ కోసం చాలా చేశారన్నారు. రాబోయే ప్రపంచకప్ (2027) వరకు ఇంకా చాలా దూరం ఉందని.. వారు ఓ ఫార్మాట్లో ఆడుతూ సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ మ్యాచ్‌లు ఆడుతూ ఉంటే వారి పరిస్థితిని అంచనా వేస్తూనే ఉంటామన్నారు. 2027 నాటికి అనేక మార్పులు సాధ్యమేనని, అది కోహ్లీ, రోహిత్‌పై మాత్రమే ఆధారపడి ఉండదని, అప్పటికి చాలా మంది యువ ఆటగాళ్ల పరిస్థితి కూడా మారవచ్చని అగార్కర్ స్పష్టం చేశారు.
అనుభవం, ఫామ్ మధ్య సమతుల్యత కోరుకుంటూ బీసీసీఐ ఈ చొరవ, బోర్డు ప్రస్తుతం అనుభవం, ప్రదర్శన మధ్య సమతుల్యత బోర్డు భావిస్తుంది. దేశీయ క్రికెట్లో పాల్గొనడం వల్ల ఆటగాళ్ల ఫిట్నెస్, టెక్నిక్‌ను పరీక్షిస్తుందని.. అయితే ఇది యువ ఆటగాళ్లకు పేర్లు, ప్రదర్శనలు, మీ స్థానాన్ని నిర్ణయిస్తాయనే సందేశాన్ని పంపుతుందని బీసీసీఐ భావిస్తుంది. కోహ్లీ, రోహిత్‌కు, దేశీయ క్రికెట్‌కు తిరిగి కేవలం లాంఛనప్రాయం కాకుండా.. ఇది వారి ఫామ్, భవిష్యత్తుకు కీలకంగా మారే అవకాశం ఉంది.